Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ సర్వత్ర సర్దుకొనిపొండి దాదాశ్రీ : వాగ్దానం చేసావు. చాలా గొప్ప విషయం. దీనినే వీరత్వం అంటారు. భోజన సమయంలో సర్దుబాటు ఆదర్శపూర్వక దైనందిన జీవిత వ్యవహారం అనగా ప్రతి సమయంలోనూ సర్దుకొని పోవటమే. మీ ఆధ్యాత్మికోన్నతి కోసం ఈ అమూల్య సమయాన్ని వినియోగించాలి. అభిప్రాయ భేదాలను సృష్టించుకోవద్దు. అందుకోసం నేను మీకు ఈ సూత్రాన్ని యిస్తున్నాను. "ఎడ్జస్ట్ ఎవ్విరివేర్'! ఎడ్జస్ట్! ఎడ్జస్ట్! ఎడ్జస్ట్! కడీలో (మజ్జిగతో చేసిన వేడి సూప్) ఉప్పు చాలా ఎక్కువైతే ఎడ్జస్ట్ కావటం గురించి దాదాజీ ఏమి చెప్పారో మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఆ పదార్ధాన్ని కొంచెంగా తినండి. అవసరమైతే ఏదైనా పచ్చడి వడ్డించమని అడగండి, కానీ వివాదపడవద్దు. యింట్లో ఏ విధమైన ఘర్షణలు ఉండకూడదు. సర్దుబాటు జీవితంలోని విపత్కర సమయాలలో సమన్వయాన్ని, సహజీవనాన్ని సమకూరుస్తుంది. నీకు అదియిష్టం లేకున్నా, ఏదోవిధంగా స్వీకరించు, ఎవరు నీతో అననుకూలంగా ఉంటారో ఆవ్యక్తితోనే నీవు ఎడ్జస్టు కావాలి. దైనందిన జీవితంలో అత్తాకోడళ్ళ మధ్య అననుకూలతలు, అభిప్రాయ భేదాలు ఏర్పడినచో ఈ దుర్గమ సంసార చక్రంనుంచి ఎవరు బయటపడాలనుకొంటారో వారే ఎడ్జస్ట్ కావాలి. భార్య,భర్తల మధ్య కూడ ఒకరు వస్తువులను చిందరవందర చేస్తుంటే రెండవవారు సరి చేయాలి. బాంధవ్యము శాంతి పూర్వకంగా నిలిచి ఉండాలంటే ఇది ఒక్కటే మార్గము. ఒకరు ఉద్రేకపూరితులైనప్పుడు రెండవవారు మౌనం వహించాలి. ఎలా ఎడ్జస్ట్ కావాలో మీకు తెలియకపోతే మిమ్మల్ని ప్రజలు పిచ్చి వారుగా పరిగణిస్తారు. ఈ అశాశ్వతమైన జగత్తులో మీరు చెప్పినదే సత్యమని, అదే జరగాలని పట్టుబట్టవలసిన అవసరం లేదు. ఒక దొంగతో కూడ మీరు ఎడ్జస్ట్ కాగలిగి ఉండాలి. ఆమెను సరిదిద్దటమా లేక ఆమెతో ఎడ్జస్ట్ కావటమా? ప్రతి సందర్భంలోను మీరు ఎదుటివ్యక్తితో ఎడ్జస్ట్ అయినచో జీవితం ఎంతో అందంగా వుంటుంది. మన మరణ సమయంలో మనం వెంట ఏమి తీసికొని వెళ్తాం? 'నేను ఆమెను సరిచేస్తాను” అని భర్త భార్య గురించి మాట్లాడుతాడు. నీవు గనుక ఆమెను తిన్నగా చేయ ప్రయత్నిస్తే నీవే స్వయంగా వంకర అవుతావు. నీ భార్యని

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38