Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 18
________________ సర్వత్ర సర్దుకొనిపొండి స్త్రీ జాతి సహజలక్షణం, కనుక నీవే మారవలసి వున్నది. స్త్రీల స్వాభావిక ప్రకృతి వారిని ఎడ్జస్ట్ కాకుండా నిరోధిస్తుంది. వారు మార్పు చెందటం అంత తేలిక కాదు. భార్య అంటే ఏమిటి? ప్రశ్నకర్త : మీరే చెప్పండి దాదాజీ. దాదాశ్రీ : భార్య పురుషుని యొక్క ప్రతితూనిక (కౌంటర్ వెయిట్). ఆ ప్రతి తూనిక లేకుంటే పురుషుడు క్రింద పడతాడు. ప్రశ్నకర్త : నాకు అర్ధం కాలేదు. దయతో వివరించండి. దాదాశ్రీ : ఇంజన్లలో కౌంటర్ వెయిట్స ని స్థాపించటం జరుగుతున్నది. ఈ కౌంటర్ వెయిట్స్ లేకుంటే ఇంజన్ ఫెయిల్ అవుతుంది. అదే విధంగా స్త్రీలు పురుషుని యొక్క కౌంటర్ వెయిట్. భర్తను స్థిరపర్చడానికి భార్య లేనిచో అతడు పడిపోతాడు. అతడు లక్ష్యరహితంగా ప్రతిచోటా తిరుగుతుంటాడు. స్త్రీ కారణంగా అతడింటికి వస్తాడు. లేనిచో వస్తాడా? ప్రశ్నకర్త : రాడు. దాదా శ్రీ : ఆమె అతని కౌంటర్ వెయిట్. ఘర్షణలు అన్నీ చివరికి ముగింపుకొస్తాయి. ప్రశ్నకర్త : ఉదయం జరిగిన ఘర్షణని మేము మధ్యాహ్నానికంతా మర్చిపోతాం, కానీ సాయంత్రం వేరొక కొత్త ఘర్షణ తలెత్తుతుంది. దాదాశ్రీ : ఈ సంఘర్షణల వెనుక పనిచేసే శక్తి ఏదో నాకు తెలుసు. ఏ శక్తి ప్రభావంతో ఆమె తర్కిస్తుంటుందో నాకు తెలుసు. ప్రజలు ఘర్షణ పడిన తర్వాత ఎడ్జస్ట్ అవుతారు, దీనినంతటిని మీరు జానంద్వారా గ్రహించవచ్చు. మీరు ప్రపంచంలో తప్పనిసరిగా ఎడ్జస్ట్ కావాలి. కారణమేమంటే ప్రతి సంఘటనా అంతం అయ్యేదే, అది క్రమంగా ముగిసిపోతుంది. ఘర్షణ ఏదైనా కొనసాగుతూనే ఉంటే, దానిలో తగుల్కొన్న ప్రతి ఒక్కరూ బాధపడవలసి వుంటుంది. మిమ్మల్ని మీరు గాయపరుచుకొని, ఇతరులను గాయపరుస్తారు.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38