________________
15
సర్వత్ర సర్దుకొనిపొండి
సత్యయుగంలో ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో జీవించారు. ఒక యింట్లో ఒక వందమంది నివసించినప్పటికీ అందరూ కుటుంబ పెద్దను గౌరవించి విధేయులై ఉండేవారు. ఈ కలియుగంలో కుటుంబ పెద్ద మాటను వినరు, అతని హక్కును సవాలు చేస్తారు, ఎదిరిస్తారు, అతడిని నిందిస్తారు కూడ.
ప్రతి ఒక్కరూ మనిషే కాని దీనిని గుర్తించటం ఎలాగో నీకు తెలియదు. ఇంట్లో ఒక యాభైమంది సభ్యులుండవచ్చు కానీ మీరు వారి ప్రకృతిని గుర్తించనందువల్లనే వివాదాలు తెలెత్తుతాయి. వారిలోని భేదాలను మీరు గుర్తించవలసి ఉన్నది. ఇంట్లో ఒక వ్యక్తి రోజంతా సణుగుతున్నట్లయితే, అది అతని ప్రకృతి. ఒకసారి మీరీనిజాన్ని గుర్తిస్తే ఆ పై మీరేమీ చేయవలసిన అవసరం లేదు. మీరతనిని ఇంకా నిశితంగా పరిశీలించవలసిన అవసరం లేదు.
కొంతమందికి ఆలస్యంగా నిద్రించే అలవాటుంటుంది, మరికొందరు త్వరగా నిద్రిస్తారు. వారెలా కలిసి ఉండగలరు? వారంతా ఒకే కప్పు క్రింద ఒక కుటుంబంగా కలిసి జీవిస్తే ఏమవుతుంది? ఇంట్లో ఎవరైనా నిన్ను “నువ్వు బుద్ధి హీనుడివి” అనవచ్చు. ఆ సమయంలో నీవు తెలిసికొనవలసినదేమంటే ఆవ్యక్తి కేవలం అటువంటి భాషనే ఉ పయోగిస్తాడని. అతనిని తిరిగి అవమానిస్తే నీవు అలసిపోతావు, ఘర్షణ కొనసాగుతుంది. ఆ మనిషి నిన్ను గుద్దుకొన్నాడు, కానీ నీవు కూడ అతనిని ఢీకొంటే నీవు కూడ గ్రుడ్డివాడివేనని ఋజువవుతుంది. మనుష్యుల యొక్క ప్రకృతిలోని ఈ భేదాలను అర్ధం చేసుకోమని నేను నీకు చెప్తున్నాను. ఉద్యానవనంలోని పూలయొక్క విభిన్న రంగులు, పరిమళాలు
మీ యిల్లు ఒక ఉద్యానవనం. సత్య, ద్వాపర, త్రేతాయుగాలలో ఇళ్ళు పొలాలవలె ఉండేవి. ఒక పొలంలో పూర్తిగా గులాబీలు మాత్రమే ఉండేవి, వేరే పొలంలో కేవలం లిల్లి పూలు వుండేవి. ఈ రోజుల్లో ఇళ్ళు ఉద్యానవనంలా తయారయ్యాయి, రకరకాల పువ్వులు అక్కడ కనిపిస్తాయి. ఏ మొక్కా ఇంకొక దానిని పోలి వుండదు. ఒక పువ్వు గులాబీ అయ్యిందీ, మల్లె అయ్యిందీ మనం పరీక్షించుకోవద్దా? సత్యయుగంలో ఒక ఇంట్లో ఒకరు గులాబీ అయితే, మిగిలినవారంతా గులాబీలే అయి వుండేవారు. ఇంకోయింట్లో ఒకరు మల్లె అయితే ఇంట్లోని వారంతా మల్లెలే అయి ఉండేవారు. పొలంలో ఒకేరకం మొక్కలున్నట్లుగా ఇంట్లోని వారంతా ఒకే విధంగా వుంటే ఏ