Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ సర్వత్ర సర్దుకొనిపొండి 20 ఆగ్రహపూర్వక వైఖరి కొనసాగుతుంది, ప్రతిరాత్రి ఆమె వంట చేయనని బెదిరిస్తుంది. అతను వేరే వంట మనిషిని ఎక్కడి నుంచి తెస్తాడు? అతను అప్పుచేసి అయినా సరే ఆ చీర కొనాల్సి వస్తుంది. ఆమె తనంతట తానే చీర కొనటం విరమించుకొనేలా అతను పరిస్థితిని కల్పించాలి. అతని సంపాదన నెలకి 800 రూపాయలు అయితే అందులో 100 రూపాయలు అతని జేబు ఖర్చు నిమిత్తం ఉంచుకొని మిగిలిన మొత్తాన్ని ఆమెకివ్వాలి. అపుడామె ఆ చీరను కొనుక్కోగలదా? చీర కొనే విషయమై అపుడతడు ఆమెను ఆటపట్టించగలడు కూడ. ఇక చీర కొనే విషయంలో నిర్ణయం ఆమెదే. కానీ నిర్ణయం అతని పైనే వుంటే ఆమె ఒత్తిడి చేస్తునే వుంటుంది. నేను జ్ఞానాన్ని పొందటానికి ముందే ఈ కళను నేర్చుకొన్నాను. ఆ తర్వాత చాలాకాలానికి నేను జ్ఞానిని అయ్యాను. క్లిష్ట పరిస్థితులలో వ్యవహరించవలసిన పద్ధతులను కనుగొన్న తర్వాతనే నేను జ్ఞానాన్ని పొందాను. మీకు ఈ కళ తెలియదు కనుకనే మీకు సమస్యలున్నాయి. ప్రశ్నకర్త : అవును, అది నిజమే. దాదాశ్రీ : తప్పంతా నీదేనని నీకు అర్ధమైందా? ఈ కళను నీవు తప్పక నేర్చుకోవాలి. ఘర్షణలకు మూలకారణం అజ్ఞానం దాదా శ్రీ : అజ్ఞానం వల్లనే ఘర్షణలు తలెత్తుతాయి. స్వస్వరూప జ్ఞానం, ప్రపంచ జ్ఞానం లేని కారణం గానే ఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి ప్రకృతి ఇంకొకరి ప్రకృతితో కలవదు. జానప్రాప్తికి ఒకే ఒక్క మార్గం ఉంది: ప్రతి చోటా సర్దుకొని పోవాలి (Adjust Everywhere). ఎవరైనా నిన్ను కొడితే, అతనితో నీవు ఎడ్జస్ట్ అవ్వాలి. నేను మీకు ఈ సరళమైన, తిన్ననిదారిని చూపిస్తున్నాను. ఈ ఘర్షణలు ప్రతిరోజూ సంభవించవు. మీ పూర్వ కర్మలు వాటి ఫలాలనివ్వటానికి సిద్ధంగా ఉన్నపుడు మాత్రమే ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అవి ఏర్పడినపుడు సర్దుకొని పోవాలి. మీ భార్యతో జగడం జరిగితే తర్వాత ఆమెను బయటకు భోజనానికి తీసికెళ్ళి సంతోష పెట్టాలి. ఇకమీదట మీ బాంధవ్యంలో ఏ కలతలూ రాకూడదు.

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38