________________
సర్వత్ర సర్దుకొనిపొండి
ప్రతి ఒక్కరి విషయంలోను నేను కౌంటర్ పుల్లీ ఉపయోగిస్తాను. అందువల్ల నాకెవరితోను ఘర్షణలుండవు. ఈ వ్యక్తి రివొల్యూషన్స్ ఇంతమాత్రమే అని నాకు తెలుసు. దాని ప్రకారం నేను కౌంటర్పుల్లీని ఎడ్జస్ట్ చేస్తాను. ఎదుటివ్యక్తి మిమ్మల్ని అర్ధం చేసుకోవాలంటే మీ అహంకారాన్ని తొలగించినంత మాత్రాన సరిపోదు,కౌంటర్ పుల్లీని కూడ తప్పక ఉపయోగించాలి. నేను చిన్నపిల్లలతో కూడ కలిసిపోతాను. ఎందువల్లనంటే నేను వారి విషయంలో కూడ కౌంటర్ పుల్లీని ఉపయోగిస్తాను. నేను అలా చేయనిచో వారి ఇంజన్ బ్రేక్ అవుతుంది.
18
ప్రశ్నకర్త : మనం ఎదుటివ్యక్తి స్థాయికి దిగి వచ్చినపుడే సంభాషణ అర్ధవంతంగా ఉంటుందని దీని భావమా?
దాదాశ్రీ : అవును. మీరు వారి స్థాయీ వేగానికి వచ్చినప్పుడు మాత్రమే మీ సందేశాన్ని వారికి అందించగలరు. మీకు కౌంటర్ఫుల్లీని ప్రయోగించటం తెలియకపోతే దానిలో తక్కువ రివొల్యూషన్స్ గల ఇంజను దోషం ఏమిటి?
ఫ్యూజ్ వేయటం నేర్చుకో
మెషినరీ ఎలా పనిచేస్తుందో నీవు గుర్తించాలి అంతే. ఫ్యూజ్ ఎగిరిపోతే, నీవు తిరిగి ఎలా వేస్తావు? ఎదుటి వ్యక్తి యొక్క ప్రకృతితో ఎలా ఎడ్జస్ట్ కావాలో నీవు నేర్చుకోవాలి. ఎదుటివ్యక్తి ఫ్యూజ్ ఎగిరిపోయినప్పుడు కూడ నేను ఎడ్జస్ట్ అవుతాను. అతను ఇంకేమాత్రం ఎడ్జస్ట్ కాలేకపోతే ఏమి జరుగుతుంది? ఫ్యూజ్ పోయింది. అక్కడంతా అంధకారం, అతను గోడకో లేక తలుపుకో గుద్దుకుంటాడు. ఫ్యూజ్ వైరు తెగిపోలేదు. ఎవరైనా ఫ్యూజ్నీ వేసినట్లయితే అది మళ్లీ పనిచేస్తుంది. అప్పటివరకు అతను విఫలమవుతూనే వుంటాడు.
చిన్న జీవితం: పెద్ద సమస్యలు
అన్నింటికంటే పెద్దదు:ఖం సర్దుబాటు లేకపోవటం (డిజడ్జస్ట్ మెంట్) నుంచే వస్తుంది. ప్రతి చోట ఎందుకు సర్దుకొని పోకూడదు?
ప్రశ్నకర్త : దానికి ప్రయత్నం అవసరం.