________________
17
సర్వత్ర సర్దుకొనిపొండి కౌంటర్ పుల్లీ యొక్క ఇంద్రజాలం మీరు ముందుగా మీ అభిప్రాయాన్ని వెల్లడించకూడదు. ఆ విషయంలో ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడో అతనినే అడగాలి. ఒకవేళ ఆవ్యక్తి తన మాటనే మొండిగా పట్టుకొని వున్నచో, మీ అభిప్రాయాన్ని చెప్పవలసిన పనిలేదు. ఎదుటి వ్యక్తి ఏ విధంగానూ గాయపడకుండా ఉండేలా మీరు జాగ్రత్తపడాలి. మీ అభిప్రాయాన్ని ఎదుటి వారి పై రుద్దే ప్రయత్నం చేయవద్దు. ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని అంగీకరించాలి. నేను ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని స్వీకరించి
జ్ఞానినయ్యాను. నేనెన్నడూ నా అభిప్రాయాన్ని ఇతరుల పై రుద్దను. మీ అభిప్రాయం వల్ల ఎవరికీ దు:ఖం కలుగకూడదు.
మీ మానసిక భ్రమణం యొక్క వేగం నిమిషానికి 1800, ఎదుటి వ్యక్తి యొక్క మానసిక భ్రమణ వేగం 600 అయినచో మీరు మీ అభిప్రాయాన్ని బలవంతంగా ఎదుటి వ్యక్తి పై రుద్దితే, అతని ఇంజను పాడైపోతుంది, అన్ని గేర్లు మార్చవలసి వస్తుంది.
ప్రశ్నకర్త : భ్రమణము (రివొల్యుషన్) అంటే అర్థం ఏమిటి? దాదా శ్రీ : ఒక వ్యక్తి యొక్క ఆలోచనా వేగాన్ని భ్రమణము సూచిస్తుంది. ఇది వ్యక్తి వ్యక్తికీ మారుతుంది. ఒక సంఘటన ఒక నిమిషంలో మీకు ఎన్నో విషయాలను సూచిస్తుంది. ఒకేసారి ఆ సంఘటన యొక్క అన్ని దశలను మనోవేగం మీకు సూచిస్తుంది. ప్రెసిడెంట్ యొక్క భ్రమణం నిమిషానికి 1200, నాది 5000 మరియు మహావీర్ భగవాన్ యొక్క భ్రమణం నిమిషానికి 100,000.
ఈ ఘర్షణల వెనుకవున్న కారణం ఏమిటి? మీ భార్య యొక్క ఆలోచనా వేగం 100, మీది 500. మీ ఆలోచనా వేగాన్ని తగ్గించటం కోసం కౌంటర్ పుల్లీని ఎలా ప్రయోగించాలో మీకు తెలియదు. ఇది వివాదాలకు, ఘర్షణలకు, జగడాలకు హేతువవుతుంది. ఒక్కోసారి ఇంజను మొత్తంగా చెడిపోతుంది.
రివొల్యూషన్ అంటే ఏమిటో అర్ధమైందా? నీవు ఒక శ్రామికునితో మాట్లాడినట్లయితే నీవేమి చెప్పదలచుకొన్నదీ అతడు గ్రహించలేడు. ఎందువల్లనంటే అతని రివొల్యూషన్స్ 50, నీ రివొల్యూషన్స్ 500. ప్రజల యొక్క ఆలోచనా వేగము వారి అభివృద్ధి స్థాయిని బట్టి వుంటుంది. నీవు కౌంటర్ పుల్లీని లోనికి ప్రవేశ పెట్టి నీ రివొల్యూషన్స్ ని తగ్గించినపుడు మాత్రమే ఆ శ్రామికుడు నీవు చెప్పేదానిని గ్రహించగలుగుతాడు.