________________
సర్వత్ర సర్దుకొనిపొండి
సర్దుబాటు అనే కళను ఎవరైతే నెర్చుకొన్నారో వారు శాశ్వతానందానికి మార్గాన్ని కనుగొన్నారు. సర్దుబాటు చేసికోవటమే జ్ఞానము. సర్దుబాటును నేర్చుకుంటే విజయాన్ని సాధించినట్లే. మీకు ఎదురైన బాధలు ఏమైనా
కానీ అనుభవించవలసిందే,
కానీ సర్దుకొనిపోవటం నేర్చుకొన్న వ్యక్తికి ఏ సమస్యలూ ఉండవు. పాత ఖాతాలు పూర్తయిపోతాయి. ఒకవేళ దారిలో నీకెపుడైనా బందిపోటు కలిసినట్లయితే నీవు అతనికి ప్రతికూలంగా వ్యవహరిస్తే (డిజడ్జస్ట్ అయితే) అతను నిన్ను కొడతాడు. దానికి బదులు నీవు ఎడ్జస్ట్ అయ్యి “ఫ్రెండ్, నీకేమి కావాలి? నేను తీర్ధయాత్రలకై వెళ్తున్నాను. నా వద్ద ఎక్కువ డబ్బులేదు.” అని చెప్పి నీ పని పూర్తిచేసికోవాలి. ఈ పని చేయటం వల్ల నీవతనికి అడ్జస్ట్ అయ్యా వు.
నీ భార్యవంటను నీవు విమర్శించినచో నీవు ఘోరమైన తప్పు చేసినట్లే. ఆపని చేయకూడదు. నీవు ఎన్నడూ ఏ పొరపాటూ చేయనట్లు మాట్లాడుతుంటావు. నీ జీవితాన్ని ఎవరితో గడపాలని నిర్ణయించుకొన్నావో ఆవ్యక్తితో నీవు తప్పక ఎడ్జస్ట్ కావాలి. నీవెవరినైనా గాయ పర్చినచో మహావీర్ భగవాన్ ధర్మాన్ని అనుసరిస్తున్నానని నిన్ను నీవెలా చెప్పుకోగలవు? ఇంట్లో ఏ ఒక్కరికీ దు:ఖం కలుగకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం.
ఇల్లు ఒక పూల తోట ఒక వ్యక్తి నాతో యిలా చెప్పనారంభించాడు “దాదా, నా భార్య అలా చేస్తుంది. ఇలా చేస్తుంది. ఆమెతో కలిసి జీవించటం కష్టం.”
అతని గురించి అతని భార్య ఏమంటుందని నేనతనిని అడిగాను. అతను, తన భార్య తనకు వివేకం లేదని అంటుందని చెప్పాడు. నీవు నీ వైపు మాత్రమే న్యాయానికై ఎందుకు వెతుకుతున్నావు? అతడు తన యిల్లు నాశనమైపోయిందని, భార్య, పిల్లలు పాడైపోయారని చెప్పసాగాడు. ఏమీ నాశనం కాలేదని, వారిని అర్ధం చేసుకోవటం అతనికి తెలియలేదని నేనతనికి చెప్పాను. ఇంట్లో ప్రతి ఒక్కరినీ అర్ధం చేసికోవటం నేర్చుకోవాలని వారి ప్రకృతిని గుర్తించాలని నేనతనికి చెప్పాను.
సర్దుబాటు చేసికోలేకపోవటానికి కారణం ఏమిటి? మీ కుటుంబం పెద్దది. చాలామంది సభ్యులున్నారు. అందరితో సమాధాన పడటం కష్టంగా ఉంటుంది. అందరి ప్రకృతి ఒకే విధంగా ఉండదు. ప్రజల ప్రకృతి ప్రస్తుత కాలానుగుణంగా వుంటుంది.