Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 20
________________ 11 సర్వత్ర సర్దుకొనిపొండి మృదుస్వభావం గలవారితో ఎవరైనా ఎడ్జస్ట్ అవుతారు. కాని కఠినమైన మూర్ఖపు పట్టుదలగల, నిర్దయులైన వారితో ఎడ్జస్ట్ అవ్వటం నేర్చుకొంటే మీరు నిజంగా కొంతైనా సాధించినట్లు. ఒక వ్యక్తి ఎంత అవమానకరమైనవాడు, సిగ్గుమాలిన వాడైనప్పటికీ మీ మనసు కలతపడని రీతిలో మీరు అతనితో ఎడ్జస్ట్ కాగలిగితే అది ఎంతో విలువైనది. ప్రపంచంలో ఏదీ మీకు ఫిట్ కాదు (అనుకూలంగా ఉండదు.) మీరే దానిలో ఫిట్ అయితే ప్రపంచం సుందరంగా ఉంటుంది. కానీ మీరు దానిని మీకు ఫిట్ అయ్యేలా చెయ్యాలని ప్రయత్నిస్తే అది వికృతమౌతుంది. అందరితో, అన్నివేళలా సర్దుకొని పోవాలి. మీరు ప్రపంచంలో ఎడ్జస్ట్ అయినంతకాలం ఏ సమస్యలూ ఉండవు. న్యాయానికై చూడకు, కేవలం సెటిల్ చేసుకో ఎడ్జస్ట్ అవ్వటానికి నిరాకరించే వ్యక్తితో కూడ జ్ఞాని ఎడ్జస్ట్ అవుతాడు. జ్ఞాని పురుషుని గమనించినచో అన్ని విధాలుగా సర్దుబాట్లు చేసికోవటం మీరు నేర్చుకోగలరు. ఈ జ్ఞానం వెనుకవున్న సైన్సు మీరు వీతరాగులు కావటానికి సహాయపడుంది. అనగా రాగద్వేషాలనుంచి మీరు స్వేచ్ఛను పొందుతారు. మీలోపల ఇంకను జీవించివున్న రాగము లేక ద్వేషము మీ బాధలకు కారణము. మీరు మీ ప్రాపంచిక వ్యవహారాలలో తటస్థంగా, ఉదాసీనంగా మారినచో లోకం మిమ్మల్ని అనర్హులుగా పేర్కొంటుంది. మొండివారిని, భేదాభిప్రాయము గలవారిని కూడ మీరు సమాధానపర్చగలగాలి. మనకు రైల్వే స్టేషనులో కూలీ అవసరమున్నప్పుడు, అతను ధర విషయంలో స్వల్పమైన భేదానికి పట్టుబడితే కొంత ఎక్కువ మూల్యానికైనా వ్యవహారాన్ని సెటిల్ చేసికోవాలి. అలా కానిచో మనమే స్వయంగా లగేజ్ ని మోసుకొనవలసి వస్తుంది. న్యాయాలను చూడవద్దు. దయచేసి సెటిల్ చేసుకోండి. ఎదుటి వ్యక్తిని సమాధానపడమని చెప్పే సమయం ఎక్కడిది? ఎదుటి వ్యక్తి నూరు తప్పులు చేసినా వాటిని మీ తప్పులుగానే భావించి ముందుకు సాగిపోవాలి. ఈ కాలంలో న్యాయం కోసం ఎక్కడని వెదకాలి? ఈ కాలం దోషభూయిష్టమైంది. అంతటా అస్థవ్యస్థత నెలకొని వుంది. ప్రజలు కలవరపాటుకు గురౌతున్నారు. ఇంటికి వెళ్తే భార్య అతనిపై కేకలు వేస్తుంది. అతని పిల్లలు ఫిర్యాదు చేస్తారు. ఆఫీసులో పై అధికారి అతనిపై అధికారం చలాయిస్తాడు. ఆఫీసుకు చేరేలోపు రైలులో ప్రజల తొక్కిసలాట. ఎక్కడా శాంతిలేదు. ప్రతి ఒక్కరికీ శాంతి కావాలి. ఎవరైనా కలహానికి దిగితే మనకి అతనిపై దయ కలగాలి

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38