Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ సర్వత్ర సర్దుకొనిపొండి బాగుచేయటానికి ప్రయత్నించకు. ఆమెను ఉన్న దానిని ఉన్నట్లుగానే స్వీకరించు. జన్మ జన్మలకీ ఆమెతో నీకు శాశ్వత బాంధవ్యం ఉంటుందన్న గ్యారంటీ ఉంటే అది వేరే విషయం . ఆమె తన మరుజన్మలో ఎక్కడుంటుందో ఎవరికి తెలుసు? మీ ఇరువురి మరణం వేర్వేరు సమయాలలో జరుగుతుంది. అలాగే ఎవరి కర్మలు వారివి, అవి కూడ వేర్వేరుగానే వుంటాయి. ఈ జన్మలో ఆమెను నువ్వు సరిదిద్దాలని యత్నించినప్పటికీ ఆమె మరు జన్మలో ఇంకొకరి భార్య అవుతుంది. అందువల్ల ఆమెను బాగుపరిచే ప్రయత్నం చెయ్యకు. ఆమె కూడ నిన్ను సరిచెయ్యాలని యత్నించకూడదు. ఆమె ఎలా ఉన్నప్పటికీ బంగారం అంత మంచిదని భావించు. నీవెంత గట్టి ప్రయత్నం చేసినప్పటికీ ఇంకొకరి ప్రకృతిని (స్వాభావిక లక్షణాలను) సరిచేయలేవు. కుక్క తోకను తిన్నగా చెయ్యాలని నువ్వెంతగా శ్రమించినా, అది వంకరగానే వుంటుంది. అందువల్ల నీవు జాగ్రత్తగా ఉంటూ ఆమెను ఎలా ఉన్నదో అలాగే వుండనివ్వు. సర్వత్ర సర్దుకొనిపో. భార్య ఒక ప్రతితూనిక ప్రశ్నకర్త : నేను నా భార్యతో ఎడ్జస్ట్ కావటానికి నిజంగా ఎంతో యత్నిస్తాను. కానీ అలా కాలేకపోతున్నాను. దాదాశ్రీ : ప్రతిదీ గత ఖాతాల ననుసరించి వుంటుంది. ఇది నట్స్ మరియు బోల్ట్ వంటి సాధారణ విషయం. నట్ మరియు బోల్ట్ ఒకదానికొకటి తగిన విధంగా జతకుదరాలి. మరలతో కూడిన బోల్ట్ కి సాదా నట్ ని అమర్చడము వీలు కాదు. నీవిలా తలుస్తుండవచ్చు, “స్త్రీలెందుకు యిలా ఉంటారు?” స్త్రీలు మీ యొక్క ప్రతి తూనిక. (త్రాసు యొక్క ఒక పళ్ళెంలో గుండు, రెండవ పళ్ళెంలో పదార్ధం ఉంటుంది. అవి ఒకదాని కొకటి ప్రతి తూనిక. లేకుంటే ఒకవైపు మాత్రమే భారమై క్రిందకు పడిపోతుంది.) వారు మీకు సహాయకారులు. ఆమె మొండితనం నీస్వంతతప్పులకు సరిపాళ్ళలో ఉంటుంది. ప్రతిదీ వ్యవస్థత్ (సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్) అని నేను దీనిని చూచి మరీ చెప్తున్నాను. ప్రశ్నకర్త : ప్రతి ఒక్కరూ నన్ను సరిచేయటానికి వచ్చినట్లుగా అన్పిస్తుంది. దాదా శ్రీ : నీవు తప్పనిసరిగా సరికావలసిందే, లేకుంటే నీ ప్రపంచం ఎలా నడుస్తుంది? నీవు బాగుపడనిచో మంచి తండ్రివి ఎలా కాగలవు? మారకపోవటం

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38