________________
సర్వత్ర సర్దుకొనిపొండి
ప్రశ్నకర్త : ఏమీ లేదు. దాదాశ్రీ : (ప్రశ్నకర్త యొక్క భార్యతో) దానివల్ల నీకేమైనా సమస్యలున్నాయా? ఆమె : లేదు. దాదాశ్రీ : అటువంటప్పుడు మీరీ విషయాన్ని ఎందుకు పరిష్కరించుకోరు? ప్రతి విషయంలోనూ సర్దుకొనిపొండి. అపుడేదైనా సమస్య మీకు కన్పిస్తుందా?
ప్రశ్నకర్త : ఏ మాత్రం ఉండదు. దాదాశ్రీ : లడ్డూలు, కూరలతో రుచికరమైన భోజనం తయారుచేయమని మొదట అతను మీతో చెప్తే దాని ప్రకారం మీరు ఎడ్జస్ట్ కావాలి. చాలా అలసిపోయానని త్వరగా నిద్రపోవాలనుకుంటున్నానని మీరు అతనికి చెప్పినట్లయితే అతడు తన స్నేహితుని కలిసే పనిని వాయిదా వేసుకొని ఎడ్జస్ట్ అయి త్వరగా నిద్రించాలి. మీరు మీ స్నేహితుడిని తర్వాత కలవవచ్చు కాని యింట్లో మీ ఇద్దరి మధ్య వివాదం తలెత్తకుండా చూచుకోవాలి. మీ స్నేహితునితో సత్సంబంధాలను నిల్పుకోవటం కోసం మీరు ఇంట్లో సమస్యలు సృష్టించుకొంటారు. అది పద్ధతి కాదు. అందువల్ల ముందుగా ఆమె చెప్పినట్లయితే మీరు తప్పక ఎడ్జస్ట్ కావాలి.
ప్రశ్నకర్త : ఒక వేళ అతను రాత్రి 8 గంటలకు ఏదైనా అర్జంట్ మీటింగ్ కి వెళ్లవలసి వుండగా భార్య నిద్రపొమ్మని నిర్బంధిస్తే అతడు ఏం చేయాలి?
దాదాశ్రీ : మీరిలా ఊహాగానాలు చేయరాదు. ప్రకృతి నియమం ఏమంటే “మనసుంటే మార్గం ఉంటుంది.” మీరీ విధంగా ఊహాగానం ప్రారంభిస్తే, అదే విషయాలను చెడగొడుంది. అంతకు ముందు రోజు ఆమె స్వయంగా మిమ్మల్ని వెళ్లమని ప్రోత్సహిస్తూ ఉన్నది. ఆమె మీతో పాటు కారువరకు నడచి వచ్చింది కూడ. ఇటువంటి ఊహలవల్ల ప్రతిపని సర్వనాశనమౌతుంది. నీకు అర్ధమైందా? ఎడ్జస్ట్ అవ్వాలనే ఉపదేశాన్ని పాటిస్తావా?
ప్రశ్నకర్త : పాటిస్తాను. దాదా శ్రీ : మంచిది, అయితే నాకు వాగ్దానం చెయ్యండి. ప్రశ్నకర్త : అవును దాదా! నేను వాగ్దానం చేస్తున్నాను.