________________
సర్వత్ర సర్దుకొనిపొండి
ప్రశ్నకర్త : భర్త గులాబ్ జామ్ తినాలని కోరుకుంటాడు కాని భార్య దాని బదులుగా కిచిడీ తయరు చేస్తుంది. అందువల్ల వారు కలహించుకొంటారు.
దాదాశ్రీ : అలా వారు కలహించుకొన్న తర్వాత అతను గులాబ్ జామ్ ని పొందుతాడని నీవు తలుస్తున్నావా? కిచిడీ తినటం తప్ప అతడికి వేరే గత్యంతరం ఉండదు.
ప్రశ్నకర్త : అతను హోటల్ నుంచి పిజ్జా తెప్పించుకొంటాడు. దాదాశ్రీ : అలాగా, అయితే అతను గులాబ్జామ్ తో పాటు కిచిడీని కూడ కోల్పోతున్నాడు. అతడు పిజ్జాతో సరిపెట్టుకోవలసి వుంటుంది. ఆమెకి ఏది అనుకూలమైతే అదే చేయమని అతను భార్యకి చెప్పాల్సింది. ఆమె కూడ తినాలి కదా! ఆమె భర్తతో “మీకేది ఇష్టమైతే అదే చేస్తాను. ఏమి చేయమంటారు?” అని అడుగుతుంది. అపుడతను తనకి గులాబ్ జామ్ తినాలని ఉన్నట్లు చెప్పాలి.
కానీ అతడు మొదటే గులాజామ్ చేయమని చెప్తే ఆమె అందుకు వ్యతిరేకంగా కిచిడీ చేస్తానని వాదిస్తుంది.
ప్రశ్నకర్త : ఈ అభిప్రాయ భేదాలు రాకుండా ఉండటం కోసం మీరేమి సలహాలు ఇస్తారు?
దాదా శ్రీ : నేను మీకు ఈ దారి చూపిస్తాను, “సర్వత్ర సర్దుకొనిపొండి.” ఆమె నీతో తాను కిచిడీ తయారు చేసినట్లు చెప్తే, అపుడు నీవు దానితో సరిపెట్టుకోవాలి. మిగతా సమయాలలో ఒకవేళ నీవు సత్సంగానికి వెళ్లాలనుకొంటున్నట్లు చెపితే అపుడామె నీతో ఎడ్జస్ట్ కావాలి. మొదట ఎవరు సూచన చేస్తే దాని ప్రకారం రెండవ వ్యక్తి ఎడ్జస్ట్ కావాలి.
ప్రశ్నకర్త : అపుడు వారు, ముందుగా ఎవరు మాట్లాడాలనే విషయమై పోట్లాడుకుంటారు.
దాదాశ్రీ : అవును అలాగే చేయాలి. ఏది ఏమైనా ఒక వ్యక్తి రెండవ వ్యక్తితో ఎడ్జస్ట్ కావాలి. ఎందువల్లనంటే ఏదీ మీ అధీనంలో లేదు. ఈ నియంత్రణ ఎవరి చేతుల్లో ఉ న్నదో నాకు తెలుసు. అందువల్ల, ఇలా సర్దుకొని పోవటం వల్ల నీకైమైనా యిబ్బందులున్నాయా?