Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ సర్వత్ర సర్దుకొనిపొండి అభిప్రాయ భేదాలనుంచి వైదొలగవచ్చు. వారు మరెన్నడూ మిమ్మల్ని బాధించరు. మీరు ఎడ్జస్ట్ కానిచో మీ యింటిని (జననమరణ చక్రం నుంచి ముక్తి, మోక్షము) ఎప్పుడు చేరుకుంటారు? - భార్యతో సర్దుబాటు ప్రశ్నకర్త : నేను నా భార్యతో ఎలా ఎడ్జస్ట్ కాగలను? ఆమె నాతో తర్కిస్తుంటుంది. దయ చేసి వివరించండి? దాదాశ్రీ : నీవు పని ఒత్తిడివల్ల ఆలస్యంగా యింటికొస్తావు. ఆ కారణంగా ఆమె నీతో గొడవపడుతుంది. ఆమె తన అసమ్మతిని అరుస్తూ యిలా వ్యక్తం చేస్తుంది, “నీవు ఆలస్యంగా వస్తున్నావు. దీనిని ఇంకెంతమాత్రమూ సహించను.” ఆమె తన సహనాన్ని కోల్పోయినందువల్ల నీవు యిలా చెప్పాలి, “నిజమే ప్రియా! నువ్వు చెప్పింది అక్షరాలా నిజమే. నువ్వు నన్ను వెళ్ళిపొమ్మంటే వెళ్ళి పోతాను. ఇంట్లోకి వచ్చి కూర్చోమంటే కూర్చుంటాను.” అపుడామె “వద్దు, వెళ్ళవద్దు. యిక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి” అని చెప్తుంది. ఆ తర్వాత మీరామెతో "నువ్వు భోజనం చెయ్యమంటే చేస్తాను లేకుంటే అలానే నిద్రపోతాను” అని చెప్పాలి. "లేదు మీరు భోజనం చేయండి” అని ఆమె మీకు సమాధానం చెబుతుంది. ఇదే సర్దుబాటు. ఉదయాన్నే నీకు వేడివేడిగా కప్పు కాఫీ లభిస్తుంది. కానీ నీవు ఉద్రిక్తతను పొందినచో ఆమె కూడ అసంతృప్తికరమైన రీతిలో ప్రతిస్పందించి ఉండేది. మర్నాడు ఉదయం కోపంతో కాఫీ కప్పును విసురుగా నీవైపు త్రోసి వుండేది. ఆమె ఉదాసీన వైఖరి మరో మూడు రోజులు కొనసాగి వుండేది. కిచిడీ లేదా పిజ్జా తిను. దాదా శ్రీ : ఎలా ఎడ్జస్ట్ కావాలో తెలియకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అతడు తన భార్యతో పోట్లాడవచ్చా? ప్రశ్నకర్త : అవును. దాదాశ్రీ : అలాగా? భార్యతో కలహించటం వల్ల నీవు పొందే లాభం ఏమిటి? ఇప్పటికే ఆమె నీ సంపదను పంచుకొన్నది.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38