Book Title: Adjust Every Where
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 11
________________ సర్వత్ర సర్దుకొనిపొండి నేను మాట్లాడే విధానాన్ని బట్టి అతడు నన్ను కారుణ్య మూర్తిగా గుర్తిస్తాడు. అతనిది తప్పని నేనతనికి చెప్పను. అతడు తన దృష్టి కోణాన్ననుసరించి ప్రవర్తిస్తున్నాడు. ప్రజలు సాధారణంగా దొంగని నిందించటం, నిరుపయోగమైన వ్యక్తిగా అతనిపై ముద్రవేయటం చేస్తుంటారు. మరి లాయర్ల విషయం ఏమిటి? వారు కూడ అబద్ధాలు చెప్పటం లేదా? మోసపు కేసులను కూడ వాదించి వారు గెలుస్తారు. ఇలా చేయటం వల్ల వారు వంచకులు కారా? వారు దొంగలను వంచకులుగా ముద్రిస్తారు. కాని తమ వంచనను న్యాయమని వాదిస్తారు. ఇటువంటి ప్రజలను మీరెలా నమ్మగలరు? అయినప్పటికీ వారు చెలామణి అవుతూనే వున్నారు. అవునా? నేనెవ్వరికీ వారిది తప్పని చెప్పను. వారి దృష్టికోణంలో వారు కరెక్ట్ కానీ వారి దుష్కర్మల పరిణామం ఎలా వుంటుందనే సత్యాన్ని వారికి వివరంగా చెప్తాను. 2 ముసలివారు ఇంట్లో ప్రవేశించగానే అనేక విమర్శలు, వ్యాఖ్యానాలు చేయటం మొదలు పెడతారు. “ఈస్టీరియో ఎందుకు? ఇది అలా ఉండాలి” వగైరా వ్యాఖ్యానాలు. వారు అనవసరంగా జ్యోక్యం చేసుకొంటుంటారు. యువతరంతో స్నేహ పూర్వకంగా ఉండటానికి ఎందుకు ప్రయత్నించకూడదు? కాలం మారుతుంది. యువతరం కాలానుగుణమైన సదుపాయాలు లేకుండా జీవించాలని పెద్దలు ఎలా ఊహిస్తారు? ఏదైన కొత్త వస్తువును చూడగానే యువతరం దానిని కోరు కుంటుంది. కొత్తదనం ఏమీ లేకుండా జీవితం దేనికని వారు భావిస్తారు. కొత్త వస్తువులు వస్తుంటాయి, పోతుంటాయి; వృద్ధులు వాటిలో జోక్యం చేసికోరాదు. అవి మీకు అనుగుణం కానిచో వాటిని మీరు ఉపయోగించవద్దు. ఐస్క్రీం మిమ్మల్ని తననుంచి పారిపొమ్మని చెప్పటం లేదు. మీరు తినదల్చుకోకుంటే తినవద్దు. కాని వృద్ధులు ఆవిషయమై కోపగిస్తారు. ఈ అభిప్రాయ భేదాలన్నింటికి కారణం కాలం తెచ్చే మార్పులు. యువతరం కాలానుగుణంగా ప్రవర్తిస్తారు. వృద్ధులు మారే కాలంతోపాటు మారకపోగా, కుటుంబ సభ్యులతో ఎడ్జస్ట్ కాలేరు. మోహం అనేది తృప్తి పరుపజాలని కోరిక; మార్కెట్లో కొత్త వస్తువులు ప్రత్యక్షమవ్వగానే వాటిపై మోహం కల్గుతుంది. నేను నా బాల్యం నుంచి, ఈ ప్రపంచం సరైన దిశలో ప్రయాణిస్తుందా లేక అపసవ్యదిశలో ప్రయాణిస్తున్నదా అని లోతుగా విచారించాను. ప్రపంచాన్ని మార్చేశక్తి ఎవ్వరికీ లేదని, అందువల్ల కాలానుగుణంగా ప్రతి ఒక్కరు సర్దుకొని పోవటం తప్పనిసరి అని నేను కనిపెట్టాను. మీ కుమారుడు కొత్త టోపీ ధరించి యింటికివస్తే అతనికి కోపం పుట్టించే కంఠస్వరంతో

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38