________________
సర్వత్ర సర్దుకొనిపొండి. ఈ పదసముదాయాన్ని జీర్ణించుకోండి
ప్రశ్నకర్త : నేను నా జీవితంలో శాంతిని కోరుకుంటున్నాను.
దాదాశ్రీ : నీవు జీవితంలో ఒకే ఒక సంక్షిప్త వాక్యాన్ని అంగీకరిస్తావా? దానిని సరిగా, ఉన్నది ఉన్నట్లుగా వ్రాసుకో.
ప్రశ్నకర్త : సరే.
దాదా శ్రీ : “ఎడ్జస్ట్ ఎవ్విరివేర్" ఈ సంక్షిప్త వాక్యాన్ని నీ జీవితంలో కలుపుకో, అపుడు శాంతి రాజ్యమేలుతుంది. ప్రారంభంలో ఒక ఆరు నెలలపాటు కష్టాలు అనుభవించవలసి వుంటుంది. ఎందువల్లనంటే గతజన్మ రియాక్షన్లు ఆరు నెలల వరకు వస్తుంటాయి. తర్వాత శాంతి నీ స్వంతమవుతుంది. అందువల్ల సర్వత్ర సర్దుకొని పోవాలి. ప్రస్తుత భయావహ కలియుగంలో నువ్వు ఎడ్జస్ట్ అవ్వలేక పోతే నీ నాశనం తప్పదు.
నీవు ప్రాపంచిక జీవితంలో వేరేమీ నేర్చుకోకున్నా ఫర్వాలేదు. కాని ఎడ్జస్ట్ కావటం మాత్రం తప్పనిసరిగా నేర్చుకోవాలి. నీకు ప్రతికూలంగా ఉన్న వ్యక్తితో కూడ నువ్వు ఎడ్జస్ట్ అయినట్లయితే ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు సంసార సాగరాన్ని దాటగలవు. ఇతరులతో ఎలా ఎడ్జస్ట్ కావాలో తెలిసిన వ్యక్తికి దుఃఖం కలుగదు. సర్వత్ర ఎడ్జస్ట్ కావాలి. ప్రతి ఒక్కరితోను ఎడ్జస్ట్మెంట్ (కలిసి ఉండటం, సమాధానపడటం) అనేది అత్యున్నత ధర్మము. ఈ కాలంలో ప్రజలు విభిన్న ప్రకృతులు (విభిన్న వ్యక్తిత్వాలు, గుణగణాలు, అభిప్రాయాలు కల్గి వుంటారు. అందువల్ల ఎడ్జస్ట్ కాకుండా జీవితం
ఎలా సాగుతుంది?
జోక్యం చేసికోవద్దు, సర్దుకొనిపోవాలి అంతే.
జీవితం నిరంతరం పరివర్తన చెందుతూనే వుంటుంది. అందువల్ల ఈ మార్పులకు అనుగుణంగా ఎడ్జస్ట్ కావలసి వుంటుంది. పెద్దవాళ్ళు తమ పాత పద్ధతులనే పట్టుకొని వ్రేలాడుతుంటారు. కాలంతో పాటు వారు ఎడ్జస్ట్ కావలసి వున్నది. లేనిచో అనంతమైన బాధలకు గురికావలసి వస్తుంది. కాలానుగుణంగా మీరు తప్పని సరిగా సర్దుబాట్లు చేసికోవాలి. నేను ప్రతిఒక్కరితో, ఒక దొంగతో కూడ ఎడ్జస్ట్ అవుతాను. అతనితో