Book Title: Avoid Clashes
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ పిలువబడే ఆయన ఎన్నడూ ఎవరినుంచీ స్వంత ఖర్చుల నిమిత్తం ధనాన్ని స్వీకరించలేదు. పైగా తనకు వ్యాపారంలో లభించిన లాభాలను, భక్తులను భారతదేశంలోని వివిధ యాత్రా స్థలాలకు తీసికొని వెళ్లటానికి వినియోగించేవారు. దాదాజీ మాటలు అక్రమ విజ్ఞాన్ గా పిలువబడే కొత్త, డైరెక్ట్ మరియు మెట్లదారికాని లిఫ్ట్ మార్గమైన ఆత్మానుభూతి మార్గానికి పునాది అయ్యాయి. అతడు తన దివ్య ప్రాచీన విజ్ఞాన ప్రయోగం (జ్ఞాన విధి) ద్వారా కేవలం రెండు గంటలలో ఈ జ్ఞానాన్ని ఇతరులకు అందచేశారు. వేలకొలది ముముక్షువులు ఈ విధానం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందినారు, ఇప్పటికీ వేలకొలది ముముక్షువులు పొందుతూనే ఉన్నారు. అక్రమమార్గం అంటే మెట్లు లేనిది, లిఫ్ట్ మార్గం లేక షార్ట్ కట్ మార్గం. క్రమ మార్గం అనగా మెట్టుతర్వాత మెట్టు క్రమంగా ఎక్కే ఆధ్యాత్మిక మార్గం. ఇపుడు అక్రమమార్గం ఆత్మానుభూతి నిమిత్తం డైరెక్ట్, షార్ట్ కట్ మార్గంగా గుర్తింపబడింది. దాదా భగవాన్ ఎవరు? దాదా భగవాన్ ఎవరు? అనే విషయాన్ని వివరిస్తూ ఆయన ఇలా అన్నారు : “మీకు కన్పించేది 'దాదాభగవాన్' కాదు. మీరు చూస్తున్నది. ఎ.ఎమ్. పటేల్ ని. జ్ఞానిపురుషుడనైనా నాలోపల పూర్ణరూపంలో వ్యక్తమైన భగవంతుడు 'దాదాభగవాన్'. ఆయన చతుర్దశ భువనాలకు ప్రభువు. ఆ దాదాభగవాన్ మీలోను, ప్రతి ఒక్కరిలోను కూడా ఉన్నారు. మీలో అవ్యక్త రూపంలో ఉంటే, ఇక్కడ (ఎ.ఎమ్. పటేల్ దేహంలో) సంపూర్ణంగా అభివ్యక్తమైనాడు. నేను దాదా భగవాన్ కాదు. నాలోపలి దాదాభగవాన్ కి నేను కూడా నమస్కరిస్తాను. జ్ఞాన (ఆత్మజ్ఞాన) ప్రాప్తికై వర్తమానలింక్ “నేను స్వయంగా సిద్ధులను (ప్రత్యేక ఆధ్యాత్మిక శక్తులను) కొద్దిమందికి ప్రసాదించబోతున్నాను. నేను వెళ్లిపోయిన తర్వాత వాటి అవసరం ఉండదా ? భవిష్యతరాల ప్రజలకు ఈ మార్గం యొక్క అవసరం ఉంటుంది, అవునా?” - దాదాశ్రీ పరమపూజ్య దాదా శ్రీ గ్రామ గ్రామమూ, దేశవిదేశాలు పర్యటించి ముముక్షువులకు సత్సంగంతోపాటు ఆత్మజ్ఞాన ప్రాప్తిని కలిగించారు. దానితోపాటు

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37