Book Title: Avoid Clashes
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ ఘాతిణలకు దూరంగా ఉండండి ముడుచుకొని అతని నుంచి దూరంగా ఉండటం జరుగుతుంది. ఆ ఎడబాటు కొద్దిసేపు మాత్రమే వుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడతారు. వారి మధ్యగల ప్రేమ కారణంగా ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసికొంటూ, విభేదిస్తూ మరల కలసిపోతూ వుంటారు. ఇది పునరావృత్తమౌతూనే వుంటుంది. ఎక్కడ ప్రేమ అధికంగా ఉంటుందో అక్కడ ఇంటర్ రెన్స్ వుంటుంది. ఇంటర్ రెన్స్ ఎక్కడ చోటుచేసి కొంటుందో వారి అంతరంగంలో ప్రేమభావం వుంటుంది. ఒక వ్యక్తికి పూర్వజన్మ బంధం కారణంగా ఏర్పడే ఈ అధికప్రేమ ఇంటర్ ఫెరెన్స్ కి (జోక్యం చేసుకోవటాన్కి) కారణమౌతుంది. అధిక ప్రేమ లేకుంటే జోక్యం చేసికొనే అవసరమే లేదు. ఇంటర్ ఫరెన్స్ యొక్క లక్షణం అధిక ప్రేమ. విభేదాల కారణంగానే తమ ప్రేమ బలపడుందని ప్రజలు తలుస్తారు. అది నిజమే. మీరు దేనినైతే ప్రేమ అని చెప్తున్నారో అది విభేదాల నుంచి ఏర్పడే ఆకర్షణ మాత్రమే. ఈ విధమైన ఆకర్షణ సదా తిరస్కారానికి గురి కావలసి వస్తుంది. ఎక్కడ విభేదాలు తక్కువగా ఉంటాయో అక్కడ ఆకర్షణ తక్కువ వుంటుంది. ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య పోట్లాటలు తక్కువగా ఉ న్నాయంటే వారి మధ్య ఆకర్షణ కూడ పరిమితంగా ఉందని మనం అర్ధం చేసికోవచ్చు. ఇది నీకు అర్ధమయిందా? ప్రశ్నకర్త : సంసార వ్యవహారాలలో అహంకార కారణంగా వాదోపవాదాలు, ఘర్షణలు జరుగుతుంటాయి. దాదాశ్రీ : ఆ ఘర్షణలు అహంకార జన్యమైనవి కావు. అవి అహంకార కారణంగా తలెత్తినట్లు కన్పించినప్పటికీ అవి విషయవికార సంబంధమైనవి. విషయం లేకపోతే ఘర్షణ ఉండదు. విషయ సమాప్తి అయితే ఘర్షణ చరిత్ర కూడ సమాప్తమౌతుంది. ఒక సంవత్సరంపాటు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించిన దంపతుల్ని ఆ కాలంలో వారి జీవితం ఎలా గడిచిందని నేను అడిగినపుడు యుద్ధాలు, ఘర్షణలు, విభేదాలు ఏమీ లేకుండా అంతా శాంతిగా ఉందని చెప్పేవారు. ప్రశ్నకర్త : ఇంటి పనులకు సంబంధించి ఘర్షణలు జరుగుతాయని

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37