Book Title: Avoid Clashes
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 33
________________ ఘాతిణలకు దూరంగా ఉండండి ఇంతకుముందు భావించేవాడిని. ఇంటి పనులలో సహాయపడినప్పటికీ ఘర్షణలు కొనసాగుతూనే ఉండేవి. దాదాశ్రీ : విషయ సంబంధం ఉన్నంత వరకు ఆ మర్పణలు కొనసాగుతూనే వుంటాయి. ఘర్షణలకు మూల కారణము విషయమే. విషయ వికారాలను జయించినవాడు అందరినీ జయిస్తాడు. అతను తనకు తెలిసిన వారినందరినీ ప్రభావితం చేస్తాడు. న్యూల రూవం నుండి అతినూక్ష్మరూవం వరకు ప్రశ్నకర్త : మీరు చెప్పిన సూత్రం “విభేదాలు మానండి” ఈ సూత్రాన్ని ఎవరు భక్తి పూర్వకంగా ఆచరిస్తే వారు చివరకు మోక్షాన్ని పొందుతారు. వీటిలో స్థూల, సూక్ష్మ, సూక్షతర విభేదాల అంతరాలను, వాటిని విడిచే విధానాలను చెప్పండి. దాదాశ్రీ : విభేదాలను మానాలి అనే నిశ్చయాన్ని అమలుపరుస్తూ ఆ మార్గంలో పురోగమించే కొద్దీ అతని అంతరస్ఫూర్తి వృద్ధిపొందుతుంది. ఎవరినుంచీ అతను నేర్చుకోవలసిన పనిలేదు. అంతనంతట అతనే తెలుసుకోగలడు. ఈ సూత్రం చివరకు వారిని మోక్షానికి చేరుస్తుంది. దాని శక్తి అంత గొప్పది. రెండవసూత్రం “బాధపడేవారిదే దోషం” ఇది కూడ మోక్షాన్ని ప్రసాదిస్తుంది. నేను చెప్పిన ప్రతి ఒక్కసూత్రం మోక్షాన్ని చేరుస్తుందని నేను గ్యారంటీ యిస్తున్నాను. ప్రశ్నకర్త : మీరు స్తంభాన్ని గుద్దుకోవటం వంటి ఉదాహరణలు యిచ్చారు. అవి స్థూల ఘర్షణకు ఉదాహరణలు. సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ ఘర్షణలకు ఉదాహరణ చెప్పండి. సూక్ష్మ ఘర్షణ అంటే ఏమిటి ? దాదాశ్రీ : మీకు మీ తండ్రితో ఏర్పడే విభేదం సూక్ష్మ ఘర్షణ. ప్రశ్నకర్త : సూక్ష్మం అంటే మానసికమా ? వాక్కు ద్వారా జరిగే ఘర్షణ కూడా సూక్ష్మ మేనా ? దాదాశ్రీ : అది స్థూల ఘర్షణ క్రింద వస్తుంది ఎందుకంటే అది అందరికీ తెలుస్తుంది. ఎదుటివారికి తెలియనిది, కన్పించనిది సూక్ష్మ ఘర్షణ.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37