Book Title: Avoid Clashes
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 31
________________ ఘాతిణలకు దూరంగా ఉండండి సమస్యలూ లేకుండా జీవించగల్గితే వచ్చే జన్మలో ఎటువంటి సమస్యలూ మనకు రావని తెల్సుకోవచ్చు. ఇపుడు మనం సమస్యలను సృష్టించుకొన్నట్లయితే అవి వచ్చే జన్మలో కూడా మన వెంట వస్తాయి. మూడు జన్మలకు గ్యారంటీ ఎవరైతే ఎవరితోనూ విభేదించకుండా వుంటారో వారు మూడుజన్మలలో ముక్తిని పొందుతారని నేను గ్యారంటీ యిస్తాను. మీరు విభేదిస్తే ప్రతిక్రమణ చేయవలసి వుంటుంది. సంఘర్షణ శారీరక స్వభావం. దేహాల మధ్య సంభవించే సంఘర్షణ ప్రతిక్రమణ ద్వారా వినాశమౌతుంది. ఎదుటివ్యక్తి గుణిస్తే, అపుడు మనం భాగించాలి. అందువల్ల శేషం ఏమీ మిగలదు. ఎదుటివ్యక్తి గురించి వ్యతిరేక భావనలు కల్గివుండటం (ఆ వ్యక్తి నన్ను అలా అన్నాడు, ఇలా అన్నాడు అని తలంచటం) అన్నింటిలోకి పెద్ద తప్పు. దారిలో వెళ్తూ చెట్టుకు గుద్దుకొంటే, మీరు దానితో ఎందుకు పోట్లాడరు? చెట్టును జడవస్తువుగా చూస్తున్నారు కనుక దానితో పోట్లాడరు. ఎవరైతే ఘర్షణకు దిగుతారో వారంతా చెట్టుతోనే సమానం. ఆవుపాదం మీకాలి వేళ్లమీద పడిందనుకోండి. అపుడు దానిని మీరేమైనా అంటారా? అలాగే మనుష్యులతో కూడ ప్రవర్తించాలి. జ్ఞాని పురుషులు ఏ విధంగా అందరిని క్షమిస్తున్నారు? అజ్ఞానం వల్ల వారు గ్రహించటం లేదని, వారూ చెట్టులాంటి వాళ్ళేనని జ్ఞానికి తెలుసు. ఎవరైతే అర్ధం చేసికోగలరో వారికి చెప్పవలసిన అవసరం లేదు. వారు వెంటనే గ్రహించి లోపలే ప్రతిక్రమణ చేస్తారు. ఎక్కడ ఆనక్తి వుంటుందో అక్కడ రియాక్షన్ వుంటుంది. ప్రశ్నకర్త : చాలా సందర్భాలలో ఎవరినీ ద్వేషించాలన్న కోరికలేకపోయినప్పటికీ ద్వేషించటం జరుగుతుంది. దీనికి గల కారణం ఏమిటి? దాదాశ్రీ : ఎవరితో అలా జరుగుతుంది? ప్రశ్నకర్త : ఒక్కొక్కసారి నా జీవిత భాగస్వామితోనే జరుగుతుంది. దాదాశ్రీ : అది ద్వేషం కాదు. ఆకర్షణ నుంచి ఏర్పడే ప్రేమ సదా రియాక్షతో కూడి వుంటుంది. అందువల్ల అతను చికాకుపడటం, ఆమె మూతి

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37