________________
ఘాతిణలకు దూరంగా ఉండండి
ప్రశ్నకర్త : ఒకసారి సత్సంగంలో మీరు “చందూలాల్ (దేహం యొక్క పేరు)తో తాదాత్మ్యం చెందటం సూక్ష్మతమ ఘర్షణ” అని చెప్పారు. దాదాశ్రీ : అవును. అది సూక్ష్మతమమే.
దానిని వదలిపెట్టాలి. పొరపాటున తాదాత్మ్యం చెందితే తర్వాత పొరపాటు జరిగిందని మీరు గుర్తిస్తారు అవునా ?
ప్రశ్నకర్త : ఈ విభేదాలను తొలగించుకోవడానికి ఉపాయం కేవలం ప్రతిక్రమణ మాత్రమేనా ? ఇంకా వేరేమైనా ఉన్నదా ?
దాదాశ్రీ : ఇంకా వేరే ఏ సాధనమూ లేదు. నేను మీకు యిచ్చిన నవకల్మ్, ప్రతిక్రమణ ఒక్కటే. వేరే రెండవ సాధనం లేదు. ఈ ప్రపంచంలో ప్రతిక్రమణ మినహా వేరే ఏ సాధనమూ లేదు. అత్యున్నతమైన సాధనం ప్రతిక్రమణ. ఎందువల్లనంటే సంసారం అతిక్రమణ వల్లనే ఏర్పడుతుంది.
ప్రశ్నకర్త : ఇది ఎంత విస్మయకరం ! “ఏమి జరిగితే అదే న్యాయం”, “బాధపడేవారిదే తప్పు” ఇత్యాది సూత్రాలు ప్రతి ఒక్కటీ అద్భుత సూత్రమే. దాదాజీ సాక్షిగా మనం ప్రతిక్రమణ చేస్తే ఆ స్పందన ఆ వ్యక్తిని చేరుతుంది.
దాదాశ్రీ : అది నిజం. ఆ స్పందన వెంటనే ఆ వ్యక్తిని చేరి ఫలితాన్నిస్తాయి. ప్రతిక్రమణ అవతలివ్యక్తిని ప్రభావితం చేసినట్లు మనకు అంత:కరణలో తెలుస్తుంది.
ప్రశ్నకర్త : కానీ దాదా, ప్రతిక్రమణ వెనువెంటనే, తత్క్షణమే జరుగుతుంది. ఇది దాదా యొక్క అద్భుతం. దాదాజీ యొక్క కృప అద్భుతం. దాదాత్రీ : అవును ఆశ్చర్యకరమే. ఇది వైజ్ఞానిక విషయం.
జయ సచ్చిదానంద్