Book Title: Avoid Clashes
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ ఘాతిణలకు దూరంగా ఉండండి అందువల్ల ఎక్కడెక్కడ ఘర్షణ జరిగితే అక్కడ అనగా వెంటనే ప్రతిక్రమణ చేయటం ద్వారా ఘర్షణ ముగిసిపోతుంది. నమ్యక్ జ్ఞానం ద్వారానే పరిష్కారం ప్రశ్నకర్త : దాదా! అహంకారం వల్ల ఇంటి వద్ద, ఆఫీసులోను, దాదాజీ యొక్క పనిచేసేటపుడు కూడా విభేదాలు తలెత్తుతుంటాయి. వాటి గురించి మీరు ఏమి చెప్తారు? వాటినన్నింటిని కూడ పరిష్కరించుకోవలసిన అవసరం ఉంది కదా? దాదాశ్రీ : అవును, పరిష్కారం అవసరమే. నా వద్ద ఈ జ్ఞానాన్ని పొందినవారు సమాధానాన్ని పొందగలరు. కాని జ్ఞానాన్ని పొందని వారి మాటేమిటి? వారు ఏ విధమైన పరిష్కారాన్ని పొందగలరు. వారు ఒకరితో ఒకరు విభేదిస్తారు. ఈ జ్ఞానాన్ని పొందినవారు అలా విభేదించరు. ప్రశ్నకర్త : కానీ దాదాజీ! ఎవరూ ఘర్షణ పడకూడదు కదా! దాదాశ్రీ : ఘర్షణ స్వాభావికమైనది.. వారు అటువంటి ప్రారబ్దాన్ని వెంట తెచ్చుకున్నారు కనుక ఘర్షణ జరుగుతుంది. అటువంటి ప్రారబ్దాన్ని వెంట తెచ్చుకోకపోతే ఆ విధంగా జరగదు. ఆ వ్యక్తి స్వభావం అంతే అని గ్రహించి దానివల్ల మీరు ప్రభావితులు కాకుండా ఉండాలి. పూర్వ సంచితమైన సంస్కారాలు ఆ స్వభావాన్ని వ్యక్తం చేస్తాయి. మనం నిజస్వరూపంలో (శుద్ధాత్మగా) ఉండాలి. ఈ జ్ఞానంవల్ల అన్ని పరిస్థితులు అవే సమసిపోతాయి. కానీ మీరు ఆ పరిస్థితుల ప్రభావానికి లోనైతే ఘర్షణ కొనసాగుతుంది. ఘర్షణ ఎపడో ఒకపుడు తప్పక జరుగుతుంది. భార్యాభర్తల మధ్యకూడ జరుగుతుంది. అయినా వారు సహజీవనం సాగించటం లేదా? ఘర్పణ ఒకరినుంచి మరొకరిని వేరుచేయకుండా ఉండేలా జాగ్రత్త పడాలి. ప్రశ్నకర్త : దాదాజీ! వివాదాలకు దూరంగా ఉండాలని నిరంతరం భావించాలి కదా! దాదాజీ : అవును ఆ భావన వుండాలి. మీరు చేయవలసినది అదే. అయినప్పటికీ ఘర్షణ జరిగితే దానికి మీరు ప్రతిక్రమణ చేయాలి. ఆ వ్యక్తితో ఎప్పటిలా స్నేహపూర్వకంగా మెలగాలి. ఎన్నిసార్లు ఘర్షణ జరిగితే అన్నిసార్లు ప్రతిక్రమణ చేయాలి. కర్మయొక్క పొరల కారణంగా ఘర్షణ మరల మరల

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37