Book Title: Avoid Clashes
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 16
________________ ఘూతిణలకు దూరంగా ఉండండి 7 ఎవరి కారణంగానో మనం సహించాలి అనే చట్టం ప్రపంచంలో లేదు. ఎవరి చర్యలనైనా నీవు సహిస్తున్నావంటే అది గత జన్మలోని కర్మల ఫలంగా ఏర్పడిన నీ ఖాతా వల్లనే. ఆ ఖాతా ఎలా వచ్చిందో నీకు తెలియదు కనుక అది నిష్కారణంగా నీకు ప్రాప్తించిందని భావిస్తావు. ఎవరూ కొత్త ఖాతాని సృష్టించరు. పూర్వ జన్మ కర్మఫలమే ఇప్పుడు తిరిగి నీకు వస్తుంది. మా జ్ఞానంలో (ఆత్మ సాక్షాత్కారజ్ఞానం) సహించుకోవలసిన పనిలేదు. మా జ్ఞానం వల్ల ఎదుటివ్యక్తి శుద్ధాత్మ అని, అతను మా పాత ఖాతాలను సెటిల్ చేసే పరికరం మాత్రమే అని గ్రహిస్తాం. ఈ జాగృతి పజిల్ను సాల్వ్ చేస్తుంది. ప్రశ్నకర్త : అయితే ఇవి అన్నీ పెండింగ్ ఖాతాలని అందువల్లనే ఇపుడు తలెత్తాయని అంగీకరించి మనస్సును సమాధాన పరచుకోవాలా? దాదాశ్రీ : ఆ వ్యక్తి స్వయంగా శుద్ధాత్మ. అది అతని ప్రకృతి. భావము, భాష, చర్య వీటి ద్వారా ఫలితాలను ఇచ్చేది ప్రకృతి. మీరూ శుద్ధాత్మ, అతడూ శుద్ధాత్మ. మీ యిద్దరి ప్రకృతులు ఒకదాని ఖాతాను మరొకటి సెటిల్ చేస్తున్నాయి. ఎదుటి వ్యక్తి భావనలు - భాష చర్యల ద్వారా మిమ్మల్ని బాధిస్తున్నట్లు కన్పించేది సమస్తమూ మీ కర్మల యొక్క ఉదయం వల్లనే. ఎదుటివ్యక్తి కేవలం నిమిత్తమాత్రుడు. మన ఖాతా సెటిల్ కాగానే అతను తిరిగి వెళ్ళిపోతాడు. ఈ (ప్రకృతి) విధానాన్ని మీరు యధాతథంగా గ్రహించగలిగితే సహించుకోవటం అనే ప్రసక్తే లేదు. అవతలి వ్యక్తిని శుద్ధాత్మగాను, అతని ప్రకృతి మీ పట్ల ప్రకటితమవుతున్నది కేవలం ఆ వ్యక్తితో మీకు గల ఖాతాను సెటిల్ చేయటం కోసమేనని గ్రహిస్తేచాలు. ఈ జ్ఞానం వల్ల సహించవలసిన అవసరం రాదు. ఆ మీరు సహించుకోవటం వల్ల ఏమౌతుందో తెలుసా! ఏదో ఒక రోజు స్ప్రింగ్ ఉవ్వెత్తున లేస్తుంది. స్ప్రింగ్ ఆ విధంగా లేవటం చూశారా? నా స్ప్రింగ్ చాలాసార్లు అలా వేగంగా లేచేది. కొన్ని రోజులపాటు సహించుకొనేవాణ్ణి. తర్వాత ఒకరోజు స్ప్రింగ్ లేచి అంతా అస్తవ్యస్తం చేసేది. సహించుకోవటమన్నది అజ్ఞానదశలో జరుగుతుంది. అది నాకు బాగా గుర్తు ఉంది. అందువల్లనే సహనాన్ని నేర్చుకోవద్దని మీకు చెప్తున్నాను. సహనము అనేది కేవలం అజ్ఞానదశలోనే జరుగుతుంది. ఈ జ్ఞానం ద్వారా మీకు వివరించేది ఏమంటే ప్రతిచర్యకి వెనుక ఉన్న కారణం ఏమిటో అర్థం చేసికోండి. దాని పరిణామం ఏమిటో గ్రహించండి.

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37