________________
14
ఘాతిణలకు దూరంగా ఉండండి
ప్రశ్నకర్త : మనం ప్రమాదాలను నివారించాలనుకొంటాం. కానీ ఒక స్తంభం మీకు అడ్డువస్తే దానిని చుట్టి వెళతారు. అయినా స్తంభం వచ్చి మీ మీదపడితే అపుడు ఏమి చేయాలి? దాదాశ్రీ : అది పడితే అక్కడి నుంచి వెంటనే తప్పుకోవాలి.
ప్రశ్నకర్త : తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా స్తంభం మీదపడి గాయపర్చవచ్చు. ఉదాహరణకు నా భార్యనే తీసికోండి.
దాదాశ్రీ : అటువంటి వివాదం సంభవించినపుడు మీరు పరిష్కారం కనుక్కోవాలి.
ప్రశ్నకర్త : ఎవరైన మనల్ని అవమానిస్తే, మనం పరాభవింపబడినట్లు భావిస్తే దానికి కారణం మన అహంకారమా?
దాదాశ్రీ : వాస్తవానికి ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే, అతడు మీ అహంకారాన్ని తొలగిస్తున్నాడన్నమాట. అయినప్పటికీ ఆ అవమానం మన అహంకారాధిక్యతను మాత్రమే పోగొడుంది. దానివల్ల మనకి వచ్చే నష్టం ఏముంది? అహంకారం కర్మబంధాలనుంచి మనల్ని ముక్తులను చేయదు.
సముద్రంలా అన్నింటినీ నీలోనే వుంచుకో. ప్రశ్నకర్త : దాదా! నిత్య జీవితంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తప్పుపడ్డారు. చిన్నవాళ్ళు తమకంటె చిన్నవాళ్ళని తప్పుపడ్డారు. ఎందుకిలా జరుగుతుంది?
దాదాశ్రీ : అది అంతే. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలో తప్పుల్ని వెదకి వారిని నియంత్రించాలని ప్రయత్నిస్తారు. దానికంటె తప్పుని అంగీకరించి పొరపాటుకి బాధ్యత మనమే వహిస్తే సమస్య తేలికగా పరిష్కారమౌతుంది. ఎదుటివ్యక్తికి సహనశక్తి లేకపోతే ఆ పొరపాటును నేనే నెత్తి పైన వేసికొంటాను. ఎదుటి వారిని నిందించను. ఎదుటివారిని ఎందుకు దోషిగా చూడాలి? సముద్రంలాంటి విశాలమైన ఉదరం ఉందినాకు అన్నింటినీ దాచుకోవటానికి. నదులలోని నీరంతా
సాగరగర్భంలో యిమడటం లేదా? అలాగే మనమూ అంతా యిముడ్చుకోవాలి. దాని ప్రభావం పిల్లలపైన, ఇతరులపైన కూడ పడుంది, వారు మన ప్రేమను అనుభవిస్తారు. వారు ఆ విధమైన సుహృద్భావాన్ని అలవరచుకొంటారు. మన