________________
ఘాతిణలకు దూరంగా ఉండండి
ఘర్షణకు మాత్రం చోటు యివ్వకూడదు. జీవితంలో ఘర్షణకు చోటు యివ్వకుండా ఉంటే ఆ వ్యక్తి మోక్షాన్ని పొందగలడు. 'ఘర్షణకు తావివ్వకూడదు' అనే ఒక్కదానిని నేర్చుకొంటే అపుడు వాళ్ళకి ఏ గురువు యొక్కగాని, మరే మాధ్యమం
యొక్కగాని అవసరం లేదు. ఒకటి లేక రెండు జన్మలలో మోక్షానికి వెళ్ళిపోతారు. 'ఘర్షణకి దిగకూడదు' అని ధృఢంగా నిశ్చయించుకొని, దానిని పాటిస్తే అది జ్ఞాన ప్రాప్తికి చిహ్నం. 'నేను ఘర్షణలో లేక వివాదంలోకి వెళ్ళకూడదు' అని నిశ్చయించుకొంటే వారు తప్పక
జ్ఞానులౌతారని నేను గ్యారంటీ యిస్తాను. దేహానికి గాయమైతే మందులతో మాన్పవచ్చు. కాని ఘర్షణవల్ల మనసుకి, బుద్ధికి గాయమైతే దానిని ఎలా మాన్పగలం? వేల జన్మలకి కూడ ఆ గాయాల గుర్తులు పోవు.
ప్రశ్నకర్త : ఘర్షణ మరియు సంఘర్షణ వల్ల మనస్సు, బుద్ధి గాయపడ్డాయా?
దాదాశ్రీ : కేవలం మనస్సు, బుద్ధి మాత్రమే కాదు. అంత:కరణ మొత్తం గాయపడుంది. దాని ప్రభావం శరీరం మీద కూడ కన్పిస్తుంది. ఘర్షణ వల్ల చాలా కష్టాలు చోటుచేసుకొంటాయి.
ప్రశ్నకర్త : ఘర్షణ, వివాదాల వల్ల ఆత్మశక్తి వినష్టమౌతుందని మీరు చెప్పారు. జాగృతివల్ల ఆ శక్తులను వెనక్కి లాగి తెచ్చుకోగలమా?
దాదాశ్రీ : మీరు శక్తులను వెనక్కి లాగవలసిన అవసరం లేదు. ఆత్మశక్తి యిప్పటికీ వున్నది. ఇపుడు ఉత్పన్నమౌతూనే వుంది. గత జన్మలో ఘర్షణల కారణంగా మీరు కోల్పోయిన శక్తి అంతా ఇపుడు తిరిగి మీకు లభిస్తుంది.
కానీ యిపుడు మరల కొత్త ఘర్షణ జరిగితే మరల శక్తి వినష్టమౌతుంది. వచ్చిన శక్తులు ఆ విధంగా వినష్టమైపోతూవుంటాయి. మనకు అసలు ఘర్షణ అనేదే లేకుంటే ఆత్మశక్తులు వృద్ధి పొందుతూ వుంటాయి. ఈ ప్రపంచంలో ప్రతీకారేచ్ఛ కారణంగానే ఘర్షణ జరుగుతుంది. వైరమే సంసార వృక్షానికి బీజం. ఎవరైతే
వైరాన్నుంచి, ఘర్షణ నుంచి నివృత్తులవుతారో వారు ముక్తులౌతారు. ప్రేమవల్ల ఎటువంటి ప్రతిబంధమూ లేదు. శత్రుత్వం పోతే ప్రేమ ఉత్పన్నమౌతుంది.
కామన్ సెన్స్ - ప్రతిచోట ఉవయోగించాలి. వ్యవహారశుద్ధికి కావలసినది ఏమిటి? సంపూర్ణమైన కామన్ సెన్స్ (సంపూర్ణ