Book Title: Avoid Clashes
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 22
________________ ఘతిణలకు దూరంగా ఉండండి ప్రశ్నకర్త : మనకే బాధ కల్గుతుంది. దాదాత్రీ : అంతే కాదు. ఆ దినమంతా అస్తవ్యస్తంగానే గడుస్తుంది. ఇంకా పెద్ద నష్టం ఏమంటే వచ్చే జన్మలో మనిషిగా పుట్టే అవకాశాన్ని కోల్పోతావు. నీలో మంచితనం, సత్ప్రవర్తన ఉంటేనే మానవజన్మను పొందే అర్హత నీకు లభిస్తుంది. కానీ నీవు పశుప్రవృత్తి కల్గి అందర్నీ కొమ్ములతో పొడుస్తూ, యుద్ధం చేస్తూ వుంటే నీవు మరల మనిషిగా జన్మించే అవకాశం ఉంటుందా? కొమ్ములను వుపయోగించేవి ఏవి? ఎద్దులా లేక మనుష్యులా? ప్రశ్నకర్త : మనుష్యులే వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లుగా అన్పిస్తుంది. దాదాత్రీ : మనిషి ఆ విధంగా హాని కల్గిస్తే అతనికి పశుజన్మ ప్రాప్తిస్తుంది. అపుడు రెండు కాళ్ళకు బదులు నాల్గు కాళ్ళు (చతుష్పాదజన్మ) అదనంగా తోక కూడ లభిస్తుంది. ఆ జీవితంలో దు:ఖం కాక ఇంకేమీ వుండదు. జంతుగతి ప్రాప్తిస్తే జీవితం దుర్భరం అవుతుంది. అన్నీ బాధలు, కష్టాలతోనే కూడి వుంటుంది ఆ జీవితం. ఈ విషయాన్ని మీరు బాగా అర్ధం చేసికోవాలి. మరణ - మన అజ్ఞానానికి చిహ్నం ప్రశ్నకర్త : సుహృద్భావం లేకపోవటమే జీవితంలో విభేదాలకు కారణమా? దాదాశ్రీ : విభేదాలతో కూడినదే సంసారం. సంసారం విభేదాలతోనే నిండి వుంటుంది. ప్రశ్నకర్త : విభేదాలకు కారణం ఏమిటి? దాదాత్రీ : అజ్ఞానమే. ఎక్కడైనా ఎవరితోనైనా మనకు అభిప్రాయ భేదం వచ్చిందంటే అది మన నిర్బలతకి చిహ్నం. అది ప్రజల దోషం కాదు. విభేదించటంలో దోషం నీదే. ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా వివాదానికి పాల్పడితే మీరు వారిని క్షమాపణ కోరాలి. పొరపాటు జరిగింది తెలియలేదు అని చెప్పాలి. ఎక్కడ వివాదం ఉంటే అక్కడ నీ దోషం ఉంటుంది.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37