________________
ఘాతిణలకు దూరంగా ఉండండి
దెబ్బతగిలితే నీవు తిరిగి గోడనుకొడతావా? అదే విధంగా నీకు క్లేశాన్ని కల్గించేవారంతా గోడలే. ఎదుటివ్యక్తిని నిందించవలసిన పనిఏముంది? ఆ వ్యక్తి గోడతో సమానమని మనకి మనమే తెలియచెప్పుకోవాలి. ఆ విధంగా చేస్తే సమస్యలు, కష్టాలు ఉండవు.
ప్రశ్నకర్త : మనం మౌనంగా ఊరుకొంటే అవతలి వారు మరింత ఉ ద్రిక్తులై రెచ్చిపోయి దోషం మనదేనని భావించి ఇంకా ఎక్కువ క్లేశాన్ని కల్గిస్తారు.
దాదాత్రీ : నీవు మౌనంగా ఉండటం వల్లనే అలా జరిగిందని అనుకొంటున్నావా? నీవు అర్ధరాత్రి లేచి బాత్ రూమ్ కి వెళ్ళేసమయంలో చీకట్లో గోడకు కొట్టుకొంటే, అది కూడా నీ మౌనం వల్లనే జరిగినట్లా? నీవు మాట్లాడు
లేక మౌనంగా వుండు. జరిగిన దానికి, నీ మాట లేక మౌనానికి సంబంధం లేదు. నేను మౌనంగా ఉంటే ఎదుటి వ్యక్తికి చులకన అవుతున్నాను అని ఏమీ లేదు. నేను మాట్లాడినందువల్లనే ఇలా జరిగింది అని కూడ ఏమీ లేదు. నీ మాట గాని, నీ మౌనంగాని ఒక వ్యక్తిని ప్రభావితం చేయలేదు. ఏ వ్యక్తి స్వతంత్రంగా పరిస్థితిని మార్చలేడు. ఇది కేవలం సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్ (కేవలం వైజ్ఞానిక సంయోగిక ప్రమాణము)
ఎవరికీ స్వంతంగా ఏమీ చేయగల శక్తి లేదు. ఈ జగత్తు పూర్తిగా సత్తా విహీనమైనది. అలాంటపుడు ఈ ప్రపంచంలో దేనినైనా ఎవరు పాడుచేయగలరు? ఒకవేళ గోడకి శక్తి వుంటే, ఎదుటివ్యక్తి వద్ద కూడ శక్తి వుంటుంది. ఈ గోడకి మనతో పోట్లాడే శక్తి వుందా? ఎదుటివ్యక్తికి కూడ అంతే. ఆ వ్యక్తి కేవలం నిమిత్తమాత్రుడు. ఆ వివాదం జరగవలసి వుంది. దానిని తప్పించలేము. వ్యర్ధంగా అరచి ప్రయోజనం ఏమిటి? అతని చేతిలో ఏ శక్తీ లేదు. అందువల్ల మీరు గోడలా వుండండి మౌనంగా. మీరు మీ భార్యను తిడ్తుంటారు కాని ఆమె లోపల విరాజమానుడై వున్న పరమాత్మ దానిని నోట్ చేసికొంటాడు. ఒకవేళ మీ భార్య మిమ్మల్ని తిడుంటే మీరు గోడలా ఉండండి మీలో విరాజమానుడైన పరమాత్మ మీకు సహాయం చేస్తాడు.
అందువల్ల మీకు గోడగుద్దుకోవటానికి కారణం మీరే. ఆ తప్పు మీదే. అందులో గోడతప్పు ఏమి లేదు. ప్రజలు నన్ను అడుగుతుంటారు. "అయితే