________________
ఘతిణలకు దూరంగా ఉండండి
మీరు మోక్షాన్ని కాంక్షించినట్లయితే బుద్ధిని సర్వదా విస్మరించాలి. దాని సలహాలను పట్టించుకోకూడదు. బుద్ధి ఎటువంటిదంటే జ్ఞాని పురుషులలో కూడ తప్పుల్ని చూపిస్తుంది. ఎవరిద్వారా నువ్వు ముక్తిని పొందవలసి ఉన్నదో వారిలోనే తప్పుల్ని చూడటమా? ఆ విధంగా చేస్తే నీకు మోక్షం అనంత జన్మల వరకు దూరంగా ఉంటుంది.
విభేదాలకు కారణం మన అజ్ఞానమే. ఎవరితోనైనా ఘర్షణ జరిగితే అది మన అజ్ఞానానికి గుర్తు. సత్యా సత్యాలను భగవంతుడు చూడడు. ఏ పరిస్థితిలోనయినా వివాదానికి తలపడ్తున్నామా అని మాత్రమే భగవంతుడు చూస్తాడు. భగవంతుని దృష్టిలో న్యాయము, అన్యాయము ఉండవు. భగవంతుని వద్ద ద్వంద్వాలకు స్థానం లేదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే ఎవరితోనూ వివాద పడకుండా ఉండటమే భగవంతునికి కావలసినది.
వివాదానికి తలవడే వారంతా గోడలు నువ్వు ఒక గోడను గుద్దుకుంటే తప్పు ఎవరిది? నీదా? లేక గోడదా? నీ దారికి అడ్డుతొలగమని గాని నిన్ను గుద్దుకున్నందుకు నీకు న్యాయం చేయమని గాని నీవు గోడని అడిగితే ప్రయోజనం ఉంటుందా? మీరు గోడను తప్పించుకొని వెళ్లకుండా మీరు నిర్ణయించుకొన్న విధంగా వెళ్తే ఎవరితల జలౌతుంది?
ప్రశ్నకర్త : నాది.
దాదాశ్రీ : అందువల్ల జాగ్రత్తగా ఉండవలసినది ఎవరు? తప్పు ఎవరిది? ఎవరు గాయపడ్డారో వారిదే తప్పు. ఈ ప్రపంచం గోడలాంటిదే.
నువ్వు వెళ్ళి ఒక గోడకు లేక తలుపుకు గుద్దుకుంటే దర్వాజతో గాని, గోడతో గాని, నీకు ఏమైన అభిప్రాయభేదం కల్గుతుందా?
ప్రశ్నకర్త : దర్వాజ నిర్జీవ వస్తువు కదా!
దాదాశ్రీ : ప్రాణమున్న వస్తువు విషయంలో మాత్రమే, నీతో విభేదానికి అది కారణమని భావిస్తావన్నమాట. ఈ ప్రపంచంలో విభేదానికి కారణమైన ప్రతీదీ నిర్జీవమైనదే. జీవమున్నది ఏదీ విభేదించదు. నిర్జీవ వస్తువే విభేదిస్తుంది. అందువల్ల నీవు దానిని గోడగానే భావించి, ఇకమీదట జోక్యం చేసికోకుండా