Book Title: Avoid Clashes
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 15
________________ 6 ఘూతిలకు దూరంగా ఉండండి ప్రతీకారం. ప్రతి మనిషి, ప్రతి జీవి శత్రుత్వ భావాన్ని కల్గిఉంటుంది. విభేదం యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే ఎదుటి వ్యక్తికి మీ పట్ల ప్రతీకారేచ్ఛ అంత ఎక్కువగా ఉంటుంది. ప్రతీకారం చేయకుండా వారు మిమ్మల్ని వదలరు. అది పాము కావచ్చు, తేలుకావచ్చు, ఎద్దుకావచ్చు, గేదె కావచ్చు. మనం వాటతోవిభేదిస్తే అది తప్పక మనపట్ల వైరభావంతో ఉంటుంది. ఎందువల్లనంటే అన్నింటిలోనూ ఆత్మ వుంది. ఆ ఆత్మశక్తి అన్నింటిలో సమానంగా వుంటుంది. శారీరక దార్యం తక్కువైన కారణంగా, శారీరక బలహీనత కారణంగా అవి మన చర్యలను సహించవచ్చు కాని అంతరంగంలో వాటికి మన పట్ల వైరభావం ఏర్పడుతుంది. భవిష్యజన్మలో మనపై ప్రతీకారం తీర్చుకుంటాయి. ఒక వ్యక్తి ఎటువంటి పదజాలంతో ఎంత ఎక్కువగా మాట్లాడినా, అవి మనల్ని విభేదానికి పురికొల్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వివాదానికి మనం తలపడకూడదు. అదే ధర్మం. ప్రజలు రోజంతా ఘర్షణ పడటమే అలవాటుగా కల్గివుంటారు. అది ఎంత చిన్నమాటైనా సరే ఆ మాట కారణంగా విభేదించకూడదన్న నియమం ఏమీ లేదు. మన మాటల కారణంగా ఎదుటివారికి ఉద్వేగాన్నికల్గించటం అన్నింటికంటే పెద్దనేరం. ఎవరైనా అటువంటి పదాలను ప్రయోగిస్తే, వాటిని పట్టించుకోకపోవటమే శ్రేష్టం, అతడే మనిషి అనిపించుకోవటానికి అర్హుడు. నహించుకోకండి, పరిష్కరించుకోండి. ప్రశ్నకర్త : దాదా, విభేదాలను మానండి అని మీరు చెప్పిన దానికి అర్ధం సహనాన్ని పాటించమనే కదా? దాదాశ్రీ : విభేదాలను మానటం అంటే సహించటం కాదు, సహనశక్తికి ఒక పరిమితి ఉంటుంది. ఎంతని నీవు సహించగలవు? సహనం అంటే స్ప్రింగ్ను అణచి పెట్టటం లాంటిదే. ఎంతకాలం స్ప్రింగ్ని అణచిపెట్టగలవు? అందువల్ల సహనాన్ని నేర్చుకోవద్దు. ఎల పరిష్కరించుకోవాలో నేర్చుకోవాలి. ఈ పరిజ్ఞానం లేకపోతే అన్ని పరిస్థితులనూ సహించుకోవటం తప్ప వారికి వేరే మార్గం లేదు. ఏదో ఒకరోజు అణచిపెట్టబడిన స్ప్రింగ్ రెట్టింపు శక్తితో పైకిలేచి నష్టాన్ని కల్గిస్తుంది. అటువంటిదే ప్రకృతి నియమం.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37