Book Title: Avoid Clashes
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 13
________________ ఘూతిలకు దూరంగా ఉండండి యిస్తున్నారు. దయచేసి నాకూ యివ్వండి" అని వేడుకొన్నాడు. అతనికి చెప్పటానికి సంశయించాను. “నేను చెప్పినా దాని వలన నీకు ఏమి ప్రయోజనం? నీవు మారవు. నీవు అందరితో జగడాలను కొనసాగిస్తూనే వుంటావు" అన్నాను. 4 అతను పదిరూపాయల రైలు టిక్కెట్టు కొనటం మానేసి ఇతరుల కొరకై టీ, స్నాక్స్ నిమిత్తం ఇరవై రూపాయలు వృధాచేస్తాడు. అతని వల్ల కంపెనీకి నికర నష్టం పదిరూపాయలు. అదీ అతని చరిత్ర. అతను ఎపుడు వచ్చినా నేను సాదరంగా ఆహ్వానించటంతో సంతోషపడి "దాదా! నాకేమైనా బోధించండి” అని ప్రాధేయపడేవాడు. “రోజూ ఎవరో ఒకరితో పోట్లాడి వస్తావు. అవతలి వారి ఫిర్యాదులను ప్రతిరోజు వినాలి" అని నేను చెప్పినప్పటికీ “అయినాసరే, దాదా! నాకు ఏదో ఒకటి యివ్వండి" అనేవాడు. "నేను నీకు ఒక్క సూత్రం చెప్తాను. నువ్వు దానిని పాటిస్తాను అని హామీ యిస్తేనే, ఆ షరతు మీదనే చెప్తాను” అన్నాను. అతను దానిని పాటిస్తాను అని వాగ్దానం చేసాడు. “ఎవరితోనూ వివాదానికి దిగవద్దు” అని చెప్పాను. దానిని వివరించమని అడుగగా అతనికి యిలా వివరించి చెప్పాను. “నీవు దారిలో నడుస్తుండగా ఒక ఇనుపస్తంభం (నేలలో పాతబడినది) ఆ దారిలో ఉందనుకో. దానిని తప్పుకొని వెళతావా? లేక ముక్కు సూటిగా వెళ్ళి దానికి గుద్దుకొంటావా?” అని అడిగాను. అలా ముక్కు సూటిగా వెళ్తే నాతల పగులుతుంది అన్నాడు అతను. “ఒక ఎద్దు నీవైపు వస్తుందనుకో. దాని మార్గం నుంచి తప్పుకొని వెళతావా లేక సూటిగా వెళ్లి దానిని ఢీకొంటావా?” అని అడిగాను. “అలా చేస్తే అది నన్నుపొడుస్తుంది. అందువల్ల దానిని తప్పుకొని వెళ్తాను” అని అతని సమాధానం. “ఒక పాము దారిలో ఉందనుకో. లేదా దారిలో ఒక పెద్దరాయి ఉందనుకో. అపుడు ఏం చేస్తావు?” అని అడిగాను. దానిని తప్పించి చుట్టుతిరిగి వెళ్తాను అన్నాడు. ఎందుకు అలా చుట్టుతిరిగి వెళ్లాలి? అని ప్రశ్నించాను. “నా క్షేమం కోసమే. లేకుంటే దానిని ఢీకొంటే నాకే కదా గాయాలవుతాయి” అని సమాధానం చెప్పాడు. ఈ ప్రపంచంలో కొంతమంది రాళ్ళవంటివారు, కొంతమంది ఎద్దులాంటివారు, కొంతమంది పాములాంటివారు, కొంతమంది స్తంభంలాంటివారు. మరికొంతమంది మనుష్యులే. ఎవరితోనూ ఘర్షణకు దిగవద్దు. తప్పుకొని వెళ్ళాలి. అతనికి ఈ సలహా నేను 1951లో

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37