Book Title: Avoid Clashes
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Aradhana Trust

View full book text
Previous | Next

Page 10
________________ ఘర్షణలకు దూరంగా ఉండండి ఘర్షణలను మానండి (ఎవాయిడ్ క్లాషెస్) “ఎవరితోనూ వివాదానికి దిగవద్దు. దానికి దూరంగా ఉండండి" నా ఈ సూత్రాన్ని అమలుపరిస్తే మీరు మోక్షాన్ని పొందగలరు. మీ భక్తి, నా వాక్కు యొక్క శక్తి కలసి దానిని సాధిస్తాయి. దానికై మీ సన్నద్ధత అవసరం. నా ఈ ఒక్క వాక్యాన్ని ఖచ్చితంగా పాలిస్తే వారికి తప్పక మోక్షం లభిస్తుంది. ఈ ఒక్క మాటను యధాతథంగా అమలుపరచి నట్లయితే మోక్షం కరతలామలకం అయినట్లే. నేను చెప్పిన ఈ ఒక్క సూత్రాన్ని శ్రద్ధతో పాలించినా అద్భుతమైన అంతరంగిక శక్తి వృద్ధిపొందుతుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఘర్షణకు/ వివాదానికి తలపడకుండా ఉండగల అనంతమైన శక్తి మీలో వుంది. స్వచ్చందంగా ఆత్మవినాశన మార్గాన్ని ఎన్నుకొన్నవారితో తలపడటం దేనికి? అటుంటి వ్యక్తి ఎన్నటికీ ముక్తిని పొందలేడు సరికదా మీ ముక్తిని కూడ అడ్డుకుంటాడు. మీరు మోక్షానికి వెళ్లదలచుకొంటే అటువంటి వారి సాంగత్యం కూడ పనికిరాదు. చాలా జాగ్రత్తగా మెలగాలి. ఎటువంటి ఘర్షణకు తావు యివ్వకుండా తెలివిగా సున్నితంగా బయటపడాలి. ఎంతో మెలకువగా వ్యవహరించాలి. మోక్షమనే గమ్యాన్ని చేరటానికి మీరు ఎక్కవలసిన బండి ప్లాట్ ఫారం మీద బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. మీరు హడావిడిగా వస్తుండగా మీ ధోవతి ముళ్ళతీగకు చిక్కుకుంది. అటువంటి పరిస్థితిలో ధోవతిని ముళ్ళతీగనుంచి తప్పించటానికి ప్రయత్నిస్తూ కూర్చుంటారా? క్షణకాలం కూడ వృధా చేయకుండా ధోవతిని వదిలేసి పరుగెత్తివెళ్ళి బండి ఎక్కాలి. బండిని మిస్ కాకుండా ఉండటం ముఖ్యం కదా! ఒక క్షణకాలం

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37