________________
18
ఘూతిలకు దూరంగా ఉండండి
ఈ జ్ఞానంతో వివాదసమయాలలో వ్యవహరించగలిగితే ఆధ్యాత్మికంగా పురోగతి లభిస్తుంది. ఘర్షణ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే అంతగా పురోగమనం వుంటుంది. ఘర్షణే లేకుంటే మీరు ఉన్నచోటే ఉంటారు. అందుచేతనే మనుష్యులు ఘర్షణను వెదుకుతుంటారు.
సంఘర్షణ ద్వారా ప్రగతి మార్గం లోనికి
ప్రశ్నకర్త : ఆధ్యాత్మిక ప్రగతికి సంఘర్షణ దోహదపడ్తుందని తెల్సుకొని దానికోసం అన్వేషిస్తే ప్రగతి లభిస్తుందా?
దాదాశ్రీ : అవును, కాని ప్రజలు ఆ విధంగా అర్ధంచేసికొని, ఆ దృష్టితో చూడరు. భగవంతుడు నిన్ను ఉన్నతస్థితికి తీసికెళ్ళడు, సంఘర్షణ తీసికెళ్తుంది. సంఘర్షణ ఒక హద్దు మేరకే నిన్ను పైకి తీసికెళ్తుంది. ఆ తర్వాత జ్ఞాని మాత్రమే నీకు సహాయపడగలడు. సంఘర్షణ ప్రకృతి విధానం వల్లనే వస్తుంది. నది అడుగు భాగంలో ఉండే రాళ్లు ప్రవాహ తాకిడికి లోనై నున్నగా, గుండ్రంగా తయారయ్యే విధంగానే జీవితంలో సంఘర్షణ మనిషిని తీర్చిదిద్దుతుంది.
ప్రశ్నకర్త : ఘర్షణ, సంఘర్షణ వీటి భేదం ఏమిటి?
దాదాశ్రీ : వేటిలో జీవంలేదో అవి విభేదానికి గురైతే దానిని ఘర్షణ అంటారు. వేటిలో జీవమున్నదో అవి విభేదానికి గురైతే దానిని సంఘర్షణ అంటారు.
ప్రశ్నకర్త : సంఘర్షణ వల్ల ఆత్మశక్తి కుంటుపడ్తుందా?
దాదాశ్రీ : నిజమే. సంఘర్షణ పడాలి అనే భావమే మనలో ఉండకూడదు.
ఘర్షణకు కారణం ప్రకృతి
ప్రశ్నకర్త : ఘర్షణకు కారణం జడమా లేక చేతనమా?
దాదాశ్రీ : మీ పూర్వజన్మలోని ఘర్షణలే మరల ఘర్షణను సృష్టిస్తాయి. ఇందులో జడమా లేక చేతనమా అన్న ప్రశ్నే లేదు. ఆత్మకు దీనితో ఎటువంటి సబంధమూ లేదు. ఈ దేహమే (కాంప్లెక్స్ ఆఫ్ థాట్స్, స్పీచ్ అండ్ యాక్షన్) ఈ ఘర్షణలకు కారణం. కాని పూర్వజన్మలోని ఘర్షణలే యిపుడు మరల