________________
ఘూతిణలకు దూరంగా ఉండండి
వ్యావహారిక జ్ఞానం) కావాలి. స్థిరత, గంభీరత కల్గి ఉండాలి. ప్రపంచ వ్యవహారాలలో కామన్ సెన్స్ అవసరం. కామన్సెన్స్ ప్రతీ విషయంలోనూ ప్రతీచోట అన్వయించుకోవాలి. స్వరూపజ్ఞానంతో పాటు కామన్సెన్స్ కూడ కల్గి వుంటే ఆ వ్యక్తి ప్రకాశిస్తాడు.
17
ప్రశ్నకర్త : కామన్సెన్స్ ఏ విధంగా అభివ్యక్తమౌతుంది?
దాదాశ్రీ : ఎవరైనా మీతో వివాదానికి పాల్పడినా మీరు వారితో ఘర్షణ పడకుండా వుంటే అపుడు కామన్సెన్స్ ఉత్పన్నమౌతుంది. మీరు ఎవరితోనైనా ఘర్షణపడితే మీరు కామన్ సెన్సిని కోల్పోతారు. మీ వైపు నుంచి ఎటువంటి ఘర్షణ వుండరాదు.
మీతో ఎదుటి వ్యక్తి ఘర్షణ వల్ల మీ కామన్సెన్స్ ఉత్పన్నమౌతుంది. ఘర్షణ సందర్భంలో మీరు ఎలా వ్యవహరించాలో మీకు ఆత్మశక్తి చూపిస్తుంది. ఒకసారి ఆత్మశక్తి చూపించే ఉపాయాన్ని మీరు చూచిన తర్వాత ఆ జ్ఞానం ఎప్పటికీ పోదు. అంతేకాదు. మీ కామన్సెన్స్ ఇంకా పెరుగుతుంది. నేను ఎవరితోనూ ఘర్షణపడను. అందువల్లనే, నాకు అద్భుతమైన కామన్సెన్స్ వుంది. అందువల్లనే మీరు ఏమి చెప్పదల్చుకొన్నారో (మీ మాటల వెనుక భావాన్ని) నేను వెంటనే అర్థం చేసికోగలను. కాని తాము చెప్తున్నమాటలు దాదాకి హానికరమని ఇతరులు భావించవచ్చు. కాని ఆ హాని నిజమైన హాని కాదని నేను వెంటనే గుర్తిస్తాను. వ్యవహార దృష్టిలోనూ, ధార్మిక దృష్టిలోనూ కూడ అది హానికరం కాదు. ఆత్మ సంబంధంగా చూస్తే అహితమన్నది లేనేలేదు. అది ఆత్మకు అహితమని ఇతరులు తలంచవచ్చు కాని దానిలోని హితాన్ని నేను గ్రహించగలను. ఇదంతా కామన్సెన్స్ యొక్క ప్రభావం. అందువల్లనే కామన్ సెన్స్ ప్రతీవిషయంలోనూ అవసరం అని నిర్వచించాను. నేటి తరానికి కామన్ సెన్స్ లోపించింది. ఒకతరం నుంచి మరొక తరానికి కామన్సెన్స్ తగ్గిపోతూ వుంది.
ఈ విజ్ఞానం లభించిన తర్వాత మనుష్యులు ఘర్షణ లేకుండా ఉ ండగల్గుతారు. ఈ విజ్ఞానాన్ని పొందకపోయినప్పటికీ, ఘర్షణలు లేకుడా జీవించగల్గిన పుణ్యశాలురు ఏ కొద్దిమందో ఉండవచ్చు. అయితే అది కొన్ని సందర్భాలలో మాత్రమే, అన్ని పరిస్థితులలోనూ కాదు.