________________
ఘాతిణలకు దూరంగా ఉండండి
19
విభేదాలను కల్గిస్తాయి. ఎవరికైతే పూర్వపు ఘర్షణ పూర్తి అయిపోయిందో అంటే
పెండింగ్ లేదో వారికి ఘర్షణలుండవు. అనగా ఒక ఘర్షణ మరొక ఘర్షణకు అది ఇంకొక ఘర్షణకు కారణమౌతుంది.
శరీరం పూర్తిగా జడం కాదు, ఇది మిశ్రచేతనం. ఆత్మ యొక్క విశేషాంశము మరియు జడము యొక్క విశేషాంశము రెండూ కల్సి మూడవరూపం, ప్రకృతి స్వరూపం, ఏర్పడింది. ఇదే అన్ని ఘర్షణలను సృష్టిస్తుంది.
ప్రశ్నకర్త : ఎక్కడైతే ఘర్షణ ఉండదో అక్కడ ఉన్నతమైన అహింసా భావము ఉన్నట్లా?
దాదాశ్రీ : కాదు. అలాంటిదేమీ లేదు. ఇపుడు మీరు గోడకు ఢీకొంటే ఎంత ప్రమాదమో గుర్తించారు. సర్వజీవులలో విరాజమానుడైన పరమాత్మతో ఢీకొంటే ఇంకెంత ప్రమాదమో తెల్సుకొన్నారు. ఈ జాగృతి కారణంగా మీలో పరివర్తన చోటు చేసుకొంటుంది.
అహింసను పూర్తిగా, దాని పూర్ణ స్వరూపంలో, అర్ధం చేసికోవటం చాలా కఠినము. అందువల్ల 'ఎప్పుడూ ఘర్షణకు తావివ్వకూడదు' అని మీరు గ్రహిస్తే మీ శక్తులు పరిరక్షింపబడటమే కాక దినదినాభివృద్ధి చెందుతాయి. అపుడు ఘర్షణ కారణంగా జరిగే నష్టం ఏమీ ఉండదు. ఒకవేళ ఎపుడైనా ఘర్షణ జరిగితే ప్రతిక్రమణ చేయటం ద్వారా (హృదయ పూర్వకంగా క్షమాపణ అడగటం వల్ల) ఘర్షణ వల్ల కలిగే పరిణామాల నుంచి తప్పుకోవచ్చు. లేని పక్షంలో పరిణామాలు చాలా భయంకరంగా వుంటాయి. ఈ జ్ఞానం వల్ల మీరు ముక్తిని పొందగలరు. కాని ఘర్షణలు చోటుచేసుకుంటే ఆ మార్గంలో మీకు చాలా అవరోధాలు కల్గి, ముక్తిని పొందటం చాలా ఆలస్యం అవుతుంది.
ఒక గోడను గురించి వ్యతిరేక భావనలు (నెగెటివ్ థింకింగ్) కళాటం వల్ల అది మీకు హానిచేయదు ఎందువల్లనంటే ఆ నష్టం ఏకపక్షం కనుక. కానీ ఒక జీవిత వ్యక్తి గురించి ఒకే ఒక్క వ్యతిరేకభావన (నెగెటివ్ థాట్) కలిగితే అది విపరీతమైన హానిని కల్గచేస్తుంది. ఆ నష్టం రెండు వైపుల నుంచి వుంటుంది. కానీ మీరు ప్రతిక్రమణ చేయటం వల్ల మన దోషం చెరిపివేయబడ్తుంది.