________________ ఘర్షణలకు దూరంగా ఉండండి రద్దీగా ఉన్న రోడ్డును దాటుతున్నపుడు యాక్సిడెంట్ జరగకుండా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిత్య జీవితంలో కూడ ఇతరులతో వ్యవహరించేటపుడు అంతే అప్రమత్తతను పాటించాలి. అవతలి వ్యక్తి ఎంత క్రూరుడైనా, అతని ప్రవర్తన ఎంత ఏహ్యమైనదైనా ఎట్టి పరిస్థితులలోనూ ఎవరినీ గాయపర్చకూడదు అని నిశ్చయించుకోవాలి. మీరు ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ అవతలి వ్యక్తి మీతో ఘర్షణపడి, మిమ్మల్ని గాయపరచవచ్చు. ప్రతివివాదంలోనూ యిరు పక్షాలవారికీ నష్టము కలుగుతుంది. మీరు ఎవరికైనా దుఃఖాన్ని కల్గిస్తే అదే క్షణంలో మీకూ వేదన కలుగకమానదు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన ఉదాహరణ చెప్తాను. ఎదురుగా వస్తున్న ఏదైనా వాహనాన్ని మీరు ఢీకొంటే, ఆ యాక్సిడెంట్ కి ఫలం మరణమే. అందువల్ల ఎవరితోనూ ఘర్షణకు దిగవద్దు. ISANKALPALLI 97881893933210 Printed in India dadabhagwan.org