________________
సర్వత్ర సర్దుకొనిపొండి
ఎక్కడ మైనస్ ఉందో నేను దానికి ప్లస్ చేస్తాను. ఎక్కడ ప్లస్ వుందో దానిని నేను మైనస్ చేస్తాను. ఎవరైనా నాతో నామాటలు అర్ధవంతంగా లేవని చెప్పినట్లయితే, అతను చెప్పింది నిజమేనని నేనతనికి చెప్తాను. నేను వెంటనే సర్దుబాట్లు చేసికొంటాను.
23
ఎలా ఎడ్జస్ట్ కావాలో తెలియకపోతే మీరు మనిషని ఎలా అన్పించుకోగలరు? ఎవరైతే తమ పరిస్థితులతో ఎడ్జస్ట్ అవుతారో వారికి ఇంట్లో ఏ విధమైన ఘర్షణలు ఉండవు. నేను హీరాబాతో ఎడ్జస్ట్ అయ్యేవాడిని. మీ భార్య సాహచర్య భాగ్యాన్ని మీరు అనుభవించదల్చుకొన్నట్లయితే మీరు తప్పక ఎడ్జస్ట్ కావాలి. లేకపోతే మీరు శత్రుత్వాన్ని సృష్టించుకొంటారు.
ప్రతి ప్రాణి స్వతంత్రమైనది మరియు సుఖాన్నే అన్వేషిస్తుంది. అతడు ఇతరులకు సంతోషాన్ని యివ్వటం కోసం రాలేదు. ప్రాపంచిక సుఖాన్వేషణలో అతనికి సుఖానికి బదులు దు:ఖం ఎదురైతే శత్రుత్వాన్ని ఏర్పరచుకుంటాడు ; అతని దారికి అడ్డువచ్చింది భార్యేకావచ్చు, బిడ్డలే కావచ్చు లేక కుటుంబ సభ్యులే కావచ్చు.
ప్రశ్నకర్త : సుఖాన్ని అన్వేషిస్తూ వచ్చినప్పటికీ సుఖం లభించకపోతే శత్రుత్వం ఏర్పరచుకొంటాడా?
దాదాశ్రీ : అవును. అతని దుఃఖానికి కారణం సోదరుడైనా లేక తండ్రి అయినా లోలోన వారి పట్ల శత్రుత్వాన్ని ఏర్పరచుకొంటాడు. ఈ ప్రపంచం అంతా ఇలాగే వైర బంధాలను ఏర్పరచుకొంటుంది. మోక్ష మార్గం (స్వధర్మం, ఆత్మధర్మం)లో ఎవ్వరూ ఎవరితోనూ వైరాన్ని సృష్టించుకోరాదు.
ప్రతి ఒక్క వ్యక్తి జీవితం కొన్ని సిద్ధాంతాలను అనుసరించి నడవాలి. పరిస్థితులను అనుసరించి ప్రవర్తించాలి. సందర్భానుసారంగా ఎవరు ఎడ్జస్ట్ అవుతారో వారు కీర్తించబడతారు. మరియు గౌరవించబడతారు. ప్రతి పరిస్థితిలోను ఎలా ఎడ్జస్ట్ కావాలో తెల్సుకొన్నచో మోక్షం కరతలామలకమవుతుంది. ఇది ఒక గొప్ప ఆయుధం.
ఈ దాదా అతిపొదుపరి, మితవ్యయి, ఉదారుడు మరియు పూర్తిగా సర్దుబాటు తత్వంకూడ కలవాడు. ఇతరుల విషయంలో ఉదారుడు, తన విషయానికొస్తే మితవ్యయి. ఉపదేశ విషయంలో చాలా పొదుపుగా ఉంటాడు. ఉపదేశం క్లుప్తంగా