________________
సర్వత్ర సర్దుకొనిపొండి
కోరికను మన్నిస్తాను. నీకు వడ్డించబడిన ఆహారం ఊరికే లభించలేదు, అందువల్ల దానిని గౌరవించాలి. నీవు దానిని విమర్శించి నందువల్ల నీ ఆనందం పెరుగుతుందా లేక తగ్గుతుందా? చాలా సార్లు నాకు వడ్డించబడిన కాయగూరలు నాకు యిష్టం ఉండవు, అయినప్పటికీ నేను వాటిని తింటాను, పైగా, వండిన వారిని అభినందిస్తాను.
22
నాకు తరచుగా చక్కెర లేని టీ అందేది. నేను ఏమీ అనను. అందువల్ల ప్రజలు “నీవేమీ చెప్పకపోతే, నీ భార్య ఈ విషయాలలో నిర్లక్ష్యంగా తయారవుతుంది” అనేవారు. నేను వారితో మర్నాడు ఏమి జరుగుతుందో వేచి చూడమని చెప్పేవాడిని. మరునాడు ఆమె “నిన్న టీ లో చక్కెర లేదు. నాకా విషయం మీరెందుకు చెప్పలేదు?” అనేది. “నేను నీకు చెప్పటం దేనికి? నీవు త్రాగినపుడు స్వయంగా తెల్సుకుంటావు కదా! నీవు టీ త్రాగకపోతే నేను చెప్పివుండే వాడిని. నీవు కూడ దానిని త్రాగుతావు, అందువల్ల నీకు చెప్పవలసిన అవసరం ఏముంది?” అని నేను అనేవాడిని.
ప్రశ్నకర్త : ఇలా సర్దుబాట్లు చేసికోవటానికి ప్రతి సెకండు అప్రమత్తంగా వుండాల్సి వుంటుంది.
దాదాశ్రీ : అవును, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఈ విధంగానే ఈ జ్ఞానం మొదలవుతుంది. ఈ జ్ఞానం ఆకస్మికంగా లభించలేదు. నేను మొదటి నుంచీ ఈ సర్దుబాట్లన్నీ చేసికొన్నాను. ఘర్షణలనుంచి దూరంగా ఉన్నాను.
నేను ఒకరోజు స్నానానికి వెళ్లినపుడు నీళ్లు పోసుకోవటానికి అక్కడ లోటా లేదు. నేను ఎడ్జస్ట్ చేసికొన్నాను. నేను చేతితో నీళ్లను పరీక్షించినపుడు అవి చర్మం ఊడివచ్చేటంత వేడిగా ఉన్నాయి. చల్లని నీళ్ల కోసం పంపు తిప్పితే ట్యాంక్ ఖాళీగా ఉందని తెలిసింది. నెమ్మదిగా, జాగ్రత్తగా నా దోసిళ్లతో నీళ్లు తీసుకొని చల్లార్చుకుంటూ స్నానం చేసాను. బయట మహాత్ములు ఇలా చెప్పుకోవటం వినిపించింది, “ఈ రోజు దాదా స్నానానికి చాలా సమయం తీసుకుంటున్నారు.” నేనేమి చేయగలను. నీళ్లు చల్లారే వరకు వేచి వుండవలసి వచ్చింది. నేనెన్నడూ ఎవరికీ అసౌకర్యం కలిగించను. నేనే ఎడ్జస్ట్ అవుతాను. ఎడ్జస్ట్ అవటమే ధర్మము. ఈ ప్రపంచంలో కలపటం లేదా తీసివేయటం ద్వారా విషయాలను బ్యాలెన్స్ చేయటానికి మనం సర్దుబాట్లు చేసికోవాలి.