________________
ఘాతిణలకు దూరంగా ఉండండి
ప్రశ్నకర్త : సూక్ష్మ ఘర్షణను ఏ విధంగా తప్పించుకోవాలి ?
దాదాశ్రీ : ముందు స్థూలం, తర్వాత సూక్ష్మం, ఆ తరువాత సూక్ష్మతరం, చివరగా సూక్ష్మతమ ఘర్షణలను మానాలి.
ప్రశ్నకర్త : సూక్ష్మతర విభేదం అని దేనిని అంటారు ?
దాదాత్రీ : మీరు ఒక వ్యక్తిని కొట్టారనుకోండి. అపుడు ఆ వ్యక్తి జ్ఞాన దృష్టితో “నేను శుద్ధాత్మను. నన్ను కొట్టేది వ్యవస్థితశక్తి (సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్)” అని ఈ విధంగా గ్రహించినప్పటికీ, మనసులో అతను కించిత్ మాత్రమైనా నీలో దోషాన్ని చూస్తే అది సూక్ష్మతర విభేదము.
ప్రశ్నకర్త : ఇంకొకసారి చెప్పండి, సరిగా అర్ధం కాలేదు. దాదాత్రీ : నీవు యితరులలో చూసే దోషాలన్నీ సూక్ష్మతర విభేదాలు.
ప్రశ్నకర్త : అంటే ఇతరుల దోషాన్ని చూడటం సూక్ష్మతర ఘర్షణా?
దాదాత్రీ : అదికాదు. ఒకసారి నీవు ఇతరుల దోషం ఏమీలేదు అని (జ్ఞానదృష్టిలో) స్థిరపర్చుకొన్న తర్వాత కూడా ఇతరులకు ఆ
దోషాన్ని ఆపాదించి నట్లైతే అది సూక్ష్మతర విభేదం, ఎందువల్లనంటే ఎదుటివ్యక్తి శుద్ధాత్మ,
దోషానికి అతను అతీతుడు.
ప్రశ్నకర్త : అది మానసిక ఘర్షణ కాదా ? దాదాశ్రీ : మానసికమైనది అంతా సూక్ష్మ ఘర్షణ క్రిందకు వస్తుంది ?
ప్రశ్నకర్త : సూక్ష్మ మరియు సూక్ష్మతర ఘర్షణల మధ్య భేదం ఏమిటి? దాదాశ్రీ : సూక్ష్మతర ఘర్షణ మానసిక పరిధిని దాటి ఉంటుంది
ప్రశ్నకర్త : సూక్ష్మతర ఘర్షణ ఉన్నప్పుడు సూక్ష్మ ఘర్షణ కూడా దానితో ఉంటుందనే అర్ధమా ?
దాదాశ్రీ : అది కాదు తెల్సుకోవలసింది. సూక్ష్మ ఘర్షణ వేరు, సూక్ష్మతర ఘర్షణ వేరు అని తెల్సుకోవాలి. అన్నింటికంటె ఆఖరుది సూక్ష్మతమ ఘర్షణ.