________________
ఘాతిణలకు దూరంగా ఉండండి
సంభవిస్తుంది. ప్రతిక్రమణ చేసిన ప్రతీసారీ ఒక్కొక్కపొర విడిపోతుంది. నా విషయంలో ఎపుడు ఘర్షణ జరిగినా, దాని కారణంగా నేను మంచి జ్ఞానాన్ని పొందానని మనసులో నోట్ చేసికొంటాను. ఘర్షణ మీ జాగృతికి తోడ్పడుతుంది. ఘర్షణ ఆత్మకు విటమిన్ వంటిది (శక్తిదాయిని). ఘర్షణ వల్ల ఏ సమస్యా లేదు. కాని ఘర్షణ కారణంగా ఒకరి నుంచి మరొకరు వేరుపడటం జరుగకూడదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఇది ఆధ్యాత్మిక సాధనల సారం. ఇదే పురుషార్ధం. ఎదుటి వ్యక్తిదే తప్పు అని మీరు భావించినా, లేక మీకు ఎదుటి వ్యక్తితో తీవ్రమైన అభిప్రాయభేదం ఏర్పడినా ప్రతిక్రమణ చేయటం ద్వారా ఆ విభేదానికి మంగళం పలకాలి.
నేను అందరితో ఏ విధంగా కల్సిపోతున్నాను? నీతో కూడ కలసి మెలసి వుంటున్నానా లేదా? మన మాటల (వాణి) కారణంగానే విభేదాలు ఏర్పడతాయన్నది వాస్తవమే. నేను ఎక్కువగానే మాట్లాడతాను. అయినా విభేదాలు ఏర్పడుతున్నాయా?
ఘర్షణ సంభవిస్తుంది. వంటపాత్రలు ఒకదానికొకటి తగిలినపుడు చప్పుడు వస్తుంది. ఘర్షణను సృష్టించటం దేహలక్షణం, అది అటువంటి ప్రారబ్దాన్ని వెంట తెచ్చుకొన్నపుడు మాత్రమే. ఈ జ్ఞాన ప్రాప్తికి ముందు ఘర్షణలు నాకు కూడ అనుభవమే. కాని ఈ జ్ఞానం లభించిన తర్వాత ఎటువంటి ఘర్షణ జరగలేదు. ఎందువల్లనంటే ఈ జ్ఞానం అనుభవజన్యమైనది. ఈ జ్ఞానం వల్ల నా పూర్వపు ఖాతాలను అన్నింటినీ నేను సెటిల్ చేసికొన్నాను. మీరింకా మీ ఖాతాలను సెటిల్ చేసికోవలసి వుంది.
ప్రతిక్రమణ ద్వారా మీ దోషాలను కడిగివేసుకోండి. జ్ఞానప్రాప్తి తర్వాత ప్రతిరోజూ ఐదువందల దోషాలు మీవి మీకు కన్పించటం మొదలైతే మీరు మోక్షానికి చాలా దగ్గరవుతున్నట్లు గుర్తించవచ్చు.
మీరు ఎక్కడ ఉన్నప్పటికీ విభేదాలకు దూరంగా వుండండి. ఘర్షణలకు లోనైతే ఈ జన్మను పాడుచేసికోవటమే కాక భవిష్య జన్మను కూడ నాశనం చేసికొన్నవారవుతారు. ఈ జన్మను ఎవరైతే నాశనం చేసికొంటారో వారు ఖచ్చితంగా భవిష్య జన్మను కూడ నాశనం చేసికొన్నట్లే. ఈ జన్మలో ఎటువంటి వివాదాలు/