________________
ఘతిణలకు దూరంగా ఉండండి
విశాల హృదయాన్ని వారూ గ్రహిస్తారు. నీకు ఏది లభించినా దానిని డిపాజిట్ చేయి. ఒక వ్యక్తి నిన్ను అవమానిస్తే అతని శక్తిని నీకిచ్చి వెళ్తున్నాడన్నమాట. ఇది ప్రపంచ నియమం. అందువల్ల దానిని ఆనందంగా స్వీకరించు.
సంఘర్శణ కూడ మన ప్రారబ్ధమే ప్రశ్నకర్త : మనం విభేదాలను నివారించాలని, సమభావంతో సమాధాన పరచాలని ఎన్ని విధాల ప్రయత్నించినప్పటికీ ఎదుటివ్యక్తి మనలను బాధపెడ్తూ, అవమానిస్తే మనం ఏమి చేయాలి?
దాదాశ్రీ : చేయతగింది ఏమీ లేదు. అది మన ఖాతాయే కనుక సమభావం కల్గి సమాధానపడాలి. మన నిబంధనల్లో మనం ఉంటూ మన పజిల్ ను మనమే సాల్వ్ చేసుకోవాలి.
ప్రశ్నకర్త : వివాదం ఏమి జరిగినా వ్యవస్థిత్ యొక్క ఆధారం పైనే (నిర్ణయించబడిన మేరకే) జరుగుతుంది కదా?
దాదాశ్రీ : వ్యవస్థిత్ (సైంటిఫిక్ సర్కమ్ స్టెన్షియల్ ఎవిడెన్స్) ఆధారంగానే వివాదం చోటుచేసుకొంటుంది. కాని ఆ విధంగా మనం ఎపుడు చెప్పుకోవాలి? వివాదం అయిపోయిన తర్వాత. 'మనం ఏ వివాదానికి తావివ్వకూడదు' అని మనం నిశ్చయించుకోవాలి. ఎదురుగా స్తంభం ఉంటే దానిని చూసిన తర్వాత ప్రక్కనుంచి తప్పుకొని వెళ్లాలే గాని దానిని గుద్దుకోకూడదు కదా ! మనం జాగ్రత్తగా తప్పుకొని వెళ్ళే ప్రయత్నం చేసిన తర్వాత కూడ ప్రమాదం జరిగితే (దెబ్బతగిలితే) అపుడు 'ఇది వ్యవస్థిత్' అని చెప్పుకోవాలి. అలా కాకుండా ముందునుంచే 'వ్యవస్థితమైవుంది' (నిర్ణయింపబడివుంది) అని భావించి మనం వివేకరహితంగా ముందుకు వెళితే 'వ్యవస్థిత్' ని దురుపయోగం చేసినట్లవుతుంది.
మరణవల్ల ఆత్మశక్తి వినష్టం ఘర్షణ వల్ల ఆత్మశక్తి పూర్తిగా వినష్టమైపోతుంది. మీరు ఏదైనా ఘర్షణలో పాలుపంచుకొంటే, ఆత్మశక్తిని నష్టపర్చుకొన్నట్లే. ఎవరైనా మిమ్మల్ని ఘర్షణకు రెచ్చగొట్టినా, పురికొల్పినా సరే, దాని నుంచి మీరు తప్పుకోవాలి. ఘర్షణ జరగనే జరగకూడదు. మీ ప్రాణనష్టం జరిగితే జరుగు గాక కాని ఎట్టి పరిస్థితుల్లోను