________________
ఘాతిణలకు దూరంగా ఉండండి
మనుష్యులంతా గోడలేనా?” అవును. వాళ్ళంతా గోడలే. నేను అంతరదృష్టితో చూచి చెప్తున్నాను. ఇందులో అసత్యం ఎంతమాత్రమూ లేదు.
ఎవరితోనైనా అభిప్రాయ భేదం కారణంగా వివాదానికి దిగటం, గోడకి గుద్దుకోవటం ఈ రెండూ సమానమే. ఎటువంటి భేదమూ లేదు. ఇద్దరూ గ్రుడ్డివాళ్ళే. చూడలేని కారణంగానే ఒకరు గోడకు గుద్దుకొంటారు. చూడలేని కారణం గానే ఒక వ్యక్తి వివాదానికి దిగుతాడు. ముందు ఏమి ఉన్నదో కన్పించకపోవటం వల్లనే ఆ వ్యక్తి గోడకు గుద్దుకుంటాడు. రాబోయే పరిణామం ఏమిటో గ్రహించలేక అభిప్రాయభేదాన్ని ఏర్పరచుకొంటాడు. ముందుచూపులేని కారణంగానే క్రోధం, అభిమానం, మాయా, లోభాలు తలెత్తుతాయి. ఈ విధంగా విషయాన్ని అర్ధం చేసికోవాలి. గోడది దోషం కాదు. దానికి గుద్దుకొని గాయపడిన వ్యక్తిదే దోషం. ఈ ప్రపంచంలో అందరూ గోడలే. నువ్వు గోడకు గుద్దుకొంటే దోషం ఎవరిది అని నువ్వు వెతకవు. ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని నిరూపించవలసిన అవసరం లేదు.
నీతో విభేదానికి తలపడుతున్నవారిని గోడలుగా భావించు. చీకటిలో ద్వారము ఎక్కడుందో తెల్సుకొనే ప్రయత్నం చేస్తే నీవు ద్వారాన్ని కనుక్కోగలవు. చేతులతో తడుముకొంటూ తడుముకొంటూ వెళ్లే ద్వారం చేరగలవా? లేదా? మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేటపుడు కూడ దేనికీ గుద్దుకోకుండా రావాలి. ఎవరితోనూ ఎపుడూ ఎటువంటి వివాదానికి తావివ్వకూడదు, ఎవరితోనూ విభేదించకూడదు అనే నియమాన్ని పాటించాలి.
ఈ విధమైన జీవితాన్ని జీవించాలి.
ఎవరికీ ఏ విధంగా జీవించాలో తెలియదు. వారికి వైవాహిక జీవితాన్ని గురించి కూడ అవగాహన ఉండదు. అయినా ఆ వివాహబంధంలో చిక్కుకుంటారు. తల్లిదండ్రులు ఎలా వుండాలో వారికి తెలియదు. అయినా తల్లిదండ్రులైపోతారు. మీ
పిల్లలకు ఆనందాన్ని సంతోషాన్ని యిచ్చే విధంగా మీరు జీవించాలి. ఎవరితోనూ వివాదంలోకి దిగకూడదని ప్రతీ ఉదయం కుటుంబంలోని సభ్యులంతా ఎవరికి వారే గట్టిగా నిశ్చయించుకోవాలి. విభేదాల వల్ల కలిగే లాభం ఏమిటి?