________________
ఘాతిణలకు దూరంగా ఉండండి ఉండు. ఒకవేళ అలా విభేదం ఏర్పడినా కొంత సేపటి తర్వాత మామూలుగా టీ త్రాగటానికి ఆహ్వానించాలి.
ఒక
పిల్లవాడు ఒక రాయిని నీ మీదకు విసిరాడనుకొందాం. ఆ కారణంగా నీకుగాయమై రక్తం స్రవిస్తుంటే. ఆ
పిల్లవాడిపట్ల నీ ప్రతిచర్య ఎలా వుంటుంది? ఆ పిల్లవాడు తన పొరపాటును ఒప్పుకొన్నప్పటికి అతనిపై కోపగిస్తావా? నీవు వెళ్తుంటే కొండమీదనుంచి ఒక రాయి దొర్లి నీమీదపడి గాయమైందనుకో, కోపగిస్తావా? కోపగించవు. కారణమేమంటే ఆ రాయి పర్వతం మీద నుంచి పడింది దానిని ఎవరూ నీ మీదకు విసరలేదు. దానికి ఎవరూ కారణం కాదు.
నీవు ప్రపంచాన్ని అర్ధం చేసికోవటం నేర్చుకోవాలి. నువ్వు నా వద్దకు వస్తే నీకు చింత అనేది లేకుండా చేస్తాను. నీవు నీ భార్యతో ఆనందంగా జీవించవచ్చు, ప్రపంచంలో హాయిగా విహరించవచ్చు. పిల్లల వివాహం జరిపించి ఆనందించవచ్చు. నీ భార్యని సంతోషపెట్టవచ్చు. ఆమె ఆనందంతో "నా భర్తను మీరు చాలా తెలివిగా తీర్చిదిద్దారు అని ఒప్పుకొంటున్నాను” అని నాతో చెప్తుంది.
నీ భార్యకి పొరుగింటివారితో జగడమైందనుకోండి. ఆమె బుర్ర ఆ కారణంగా వేడెక్కి మీరు బయటినుంచి ఇంటికి తిరిగిరాగానే ఆ విషయాన్ని ఉ ద్రేకంతో మీకు చెప్పటం ప్రారంభించిందనుకోండి. అపుడు మీరేమి చేస్తారు? మీరు కూడా కోపోద్రిక్తులౌతారా? అటువంటి పరిస్థితి ఎదురైతే మీరు సర్దుకుని పోగలగాలి. ఆ విధంగా ఆమె ఉద్రిక్తతకు గురికావటానికి కారణం ఎవరో, ఏమిటో మీకు తెలియదు. మీరు పురుషులైనందువల్ల వివాదం చోటుచేసికోవటాన్ని ఆమోదించరు. ఆమె మీతో వాదన మొదలు పెడితే ఆమెను సమాధానపరచండి. అభిప్రాయభేదం అంటే అర్ధం ఘర్షణే.
సైన్సుని ఇలా అర్థం చేసికోవాలి ప్రశ్నకర్త : నేను వివాదాలకు దూరంగా ఉండాలనుకొన్నప్పటికీ, ఎదుటివ్యక్తి కావాలని నాతో పోట్లాటకు దిగితే నేను ఏమి చేయాలి?
దాదాత్రీ : ఈ గోడతో నువ్వు యుద్ధం చేయదల్చుకొంటే ఎంతసేపు యుద్ధం చేయగలవు? నీవు నడుస్తూ గోడకు గుద్దుకొన్నావనుకో. నీతలకి