________________
ఘాతిణలకు దూరంగా ఉండండి
మన పాత పెండింగ్ ఖాతాల వల్లనే అంతా జరుగుతుందని, మన ఖాతాకు సంబంధంలేనిదే ఏదీ జరగదని తెలుస్తుంది.
మరణ - కేవలం మీ పొరపాటు వల్లనే ఈ ప్రపంచంలో మీకు ఎదురయ్యే వివాదాలన్నింటికీ పూర్తిగా మీ పొరపాట్లే కారణం. ఎవరినీ నిందించవలసిన పనిలేదు. ప్రజలు ఏదో ఒక రకంగా ఘర్షణ పడ్తుంటారు. 'వివాదంలో ఎందుకు చిక్కుకొన్నారు?” అని అడిగితే 'అతని కాణంగానే, అతనే వివాదానికి దిగాడు' అని చెప్తారు. అవతలి వ్యక్తి అంధుడైతే మీరు కూడా అంధులే కావాలా?
ప్రశ్నకర్త : ఒక వివాదంలో మరొక వివాదాన్ని మనం సృష్టిస్తే ఏమి జరుగుతుంది?
దాదాశ్రీ : తల బలౌతుంది. వివాదం తలెత్తినపుడు మనం అర్ధం చేసికోవలసినది ఏమిటి?
ప్రశ్నకర్త : అది నా పొరపాటే అని.
దాదాశ్రీ : అవును. ఆ పొరపాటును నీవు వెంటనే అంగీకరించాలి. ఎపుడైనా వివాదం జరిగితే దానికి కారణమైన పొరపాటు ఏదో నీ వల్లనే జరిగిందని గుర్తించాలి. ఆ పొరపాటు నీదేనని గ్రహించగలిగితే, పజిల్ సాల్వ్ అయినట్లే. నీవు ఎదుటివ్యక్తిలో తప్పుని వెదుకుతున్నంత వరకు పజిల్ సాల్వ్ కాదు.
తప్పుమనదేనని గుర్తించి అంగీకరిస్తే ఈ ప్రపంచం నుంచి స్వేచ్ఛని పొందగలం. ఇంతకంటే వేరే పరిష్కారం లేదు. వేరే విధంగా దీనిని పరిష్కరించాలని ప్రయత్నిస్తే అది మరింత జటిలమౌతుంది. అదీ మీ సూక్ష్మ అహంకార కారణంగా. నివారణోపాయాలను ఎందుకు వెదుకుతారు.? ఎదుటివ్యక్తి ఆ తప్పు మీదేనని మీతో చెప్పినట్లయితే దానిని మీరు అంగీకరించి మీ పొరపాటుని మీరు గుర్తించినట్లుగా చెప్పాలి.
లౌకిక జీవితంలో వివాదాలకు బుద్ధేకారణం. బుద్ధిని అనుకరిస్తే పతనం తప్పదు.
రాత్రి రెండు గంటలసమయంలో నిద్రలేపి మీకు అంతా వ్యతిరేకంగా చూపిస్తుంది. ఈ బుద్ధి చివరకు ఆత్మ వినాశనానికి కారణమౌతుంది.