________________
ఘాతిణలకు దూరంగా ఉండండి
యిచ్చాను. అప్పటినుంచి అతను దానిని చాలా సీరియస్ గా పాటించాడు. ఎపుడూ ఎవరితోనూ ఏ విధమైన వివాదానికి తలపడలేదు. అతనికి యజమాని, వరుసకు పినతండ్రి కూడ, అతనిలోని మార్పును గమనించాడు. కావాలని అతనిని రెచ్చగొట్టేవాడు. పినతండ్రి ఎన్నివిధాల ఎన్నికోణాలలో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అతని మీద ఎటువంటి ప్రభావం చూపలేదు. 1951నుంచి ఏ విధమైన వివాదంలోనూ అతను చిక్కుకోలేదు.
జీవితంలో వివాదాల నుంచి ఇదే విధంగా వైదొలగాలి.
మీరు రైలు బండి నుంచి దిగిన వెంటనే మీ సామానుదించేకూలీని పిలుస్తారు. కొంతమంది కూలీలు మీ దగ్గరకుపరుగెత్తుకొని వస్తారు. వారిలో ఒకరికి మీ సామాను తెమ్మని చెప్తారు. సామాను తెచ్చిన తర్వాత డబ్బు చెల్లించే సమయంలో అతనితో ఘర్షణకు దిగుతారు. “నేను స్టేషను మాస్టరుకి చెప్తాను.
అంత డబ్బు ఎందుకు యివ్వాలి?” అని వాదిస్తారు. అటువంటి విషయాలలో గొడవ పెట్టుకోవటం అవివేకం. అతను రెండున్నర రూపాయలు అడిగితే “చూడు బ్రదర్ నిజానికి ఈ సామాను తెచ్చినంద్కు రూపాయే. పోనీ రెండు రూపాయలు తీసికో” అని సున్నితంగా చెప్పి బయటపడాలి. అటువంటి సందర్భాలలో కొంచెం ఎక్కువైనా సరే యిచ్చి వివాదం రాకుండా చూచుకోవాలి. అతనితో ఘర్షణ పడితే, అతన్ని రెచ్చగొడితే అతను కత్తి దూసినా ఆశ్చర్యం లేదు. అతను పోట్లగిత్తలా లంఘించి నిన్ను గాయపరచవచ్చు.
ఎవరైనా మీ వద్దకు వచ్చి పరుషమైన, నిందాతుల్యమైన పదజాలాన్ని ఉపయోగిస్తుంటే అతను మీతో తలపడాలనే వచ్చాడని గ్రహించి జాగరూకతతో వివాదం తలెత్తకుండా చూడాలి. మీ మనస్సుమీద మొదట దాని ప్రభావం లేకపోవచ్చు. అనుకోని విధంగా మీ మనసుకి బాధ కల్గితే, మనసు ఆహ్లాదాన్ని కోల్పోతే, ఎదుటివ్యక్తి యొక్క మనసు మీపై ప్రభావం చూపిస్తుందని గుర్తించాలి. దాని నుంచి తప్పించుకోవాలి. అర్ధంచేసికొనే శక్తి మీకు పెరిగే కొద్దీ మీరు వివాదాలను తొలగించుకోగల్గుతారు. వివాదాలను తొలగించుకోవటం ద్వారా మాత్రమే ముక్తి సాధ్యమౌతుంది.
విభేదాలతో కూడినదే ఈ ప్రపంచం. అది స్పందన స్వరూపం. అందువల్ల ఘర్షణలను మానండి. ప్రపంచ సృష్టికి మూలకారణం విభేదాలే. దాని పరిణామం