________________
ఘతిణలకు దూరంగా ఉండండి
డ్రైవ్ చెయ్యరు కదా? అందువల్లనే వారు ప్రమాదాల పాలు కాకుండా రక్షింపబడున్నారు. అదే విధంగా నిత్య జీవితంలో కూడ వివాదాలు తలెత్తకుండా కొన్ని నిబంధనలను పాటించాలి. మీ స్వంత నిబంధనలను, ఊహాగానాలను మీరు అనుసరించటం వల్ల వివాదాలు చోటుచేసి కొంటాయి. అందరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించటం వల్ల ట్రాఫిక్ లో ఎటువంటి అంతరాయం కల్గదు. వివేకంతో అదే నియామాన్ని మీరు పాటిస్తే మీరు కష్టాలలో చిక్కుకోవటం జరగదు. ఆ నియమాలను వివరించేవారు చాలా అనుభవజ్ఞులై ఉండాలి.
ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని మీరు నిశ్చయించుకోవటం వల్లనే ఆ నిబంధనలను అమలు పరచటం జరుగుతుంది. ఆ నిబంధనలను ఉ
ల్లంఘించమని మీ అహంకారం మీకు ఎంద్కు చెప్పటం లేదు. అలా చేస్తే గాయపడటమో మరణించటమో తప్పదని మీ బుద్ధి కారణంగా మీకు చక్కగా
తెలుసును కనుక. అదే విధంగా ఘర్షణ పడటం వలన (వివాదానికి తలపడటం వల్ల) కూడ అటువంటి నష్టమే జరుగుతుంది. ఇది చాలా సూక్ష్మమైనది గనుక బుద్ధి దానిని గ్రహించలేదు. ప్రమాదంలో జరిగే నష్టం స్థూలం. కాని ఘర్షణ లేక వివాద కారణంగా జరిగే నష్టం సూక్ష్మం. ఈ సూత్రం మొట్టమొదటి సారిగా ప్రవంచానికి వెల్లడి చేయబడింది.
1951 సం||లో జనన మరణ చక్రంనుండి విముక్తి పొందే మార్గం చెప్పమని ఒక వ్యక్తి నన్ను అడిగాడు. అతనికి ఈ సూత్రాన్ని చెప్పాను. ' ఎవాయిడ్ క్లాషెస్ అన్న సూత్రాన్ని పాటించమని వివరించి చెప్పాను.
ఒక రోజు నేను ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదువుతుండగా అతను వచ్చి “దాదాజీ! నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని యివ్వండి” అని అడిగాడు. అతను నా దగ్గర పనిచేస్తుండేవాడు. నేను ఇలా అన్నాను. “నేను నీకుఏమి యివ్వగలను. నువ్వు ఎపుడూ అందరితో జగడాలకు దిగుతావు. దెబ్బలాడతావు కూడ. కుస్తీపట్లు పడతావు కదా!” అతను మా వ్యాపార సంబంధమైన డబ్బుని నీళ్ళ ప్రాయంగా వృధా చేసేవాడు. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేయడమే కాక, ఆ అధికారులతో పోట్లాటకు దిగేవాడు. అతని గురించి అంతా నాకు తెలుసు. అతను పట్టువిడువకుండా “దాదాజీ మీరు అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని