________________
తొలి పలుకు మనం ఇతరులతో ఎడ్జస్ట్ కావటం నేర్చుకొనేంతవరకు జీవితంలో మరల మరల సంఘర్షణలు సంభవిస్తూనే వుంటాయి. సరైన అవగాహన వల్లనే ఈ సర్దుబాటును సాధించవచ్చు. లేకుంటే జీవితం విషతుల్యం అవుతుంది. మన యిష్టానికి విరుద్ధంగా, ప్రపంచం బలవంతంగానైనా మనల్ని ఎడ్జస్ట్ అయ్యేలా చేస్తుంది. మనంతట మనమే సరైన అవగాహనతో ఎడ్జస్ట్ అయినట్లయితే సంఘర్షణలను నివారించి, శాంతి సంతోషాలను పొందగల్గుతాం. జీవితం అంటే కేవలం ఎడ్జస్ట్ మెంట్ మాత్రమే, ఇంకా వేరేమీకాదు. జననం మొదలు మృత్యువు వరకు ఎడ్జస్ట్ కావలసి వుంటుంది. నవ్వుతూనో, ఏడుస్తూనో ఎలాగైనా ఎడ్జస్ట్ కాక తప్పదు. విద్యాభ్యాసం పట్ల ఆసక్తి వున్నా లేకున్నా ఎడ్జస్టు అయ్యి చదువుకోవలసి వుంటుంది. అదే విధంగా వైవాహిక జీవితంలో కూడ,
ప్రారంభంలో ఆనందంగా వుంటుంది. కాని తర్వాత భార్యభర్తల మధ్య ఘర్షణలు తలెత్తినా పరస్పరం సర్దుకొని పోవలసి వుంటుంది. వారి భిన్న ప్రకృతుల కారణంగా ఈ ఘర్షణలు సహజంగా సంభవిస్తాయి. ఈ కాలంలో ఒకరితో ఒకరు జీవితాంతం సర్దుకొని పోగల అదృష్టవంతులెందరున్నారు? శ్రీరాముడు మరియు సీత కూడ ఎన్నిసార్లు ఎడ్జస్ట్ కాలేదు? గర్భవతి యైన సీత అడవులకు పంపబడినప్పుడు ఆమె ఎన్ని విధాల ఎడ్జస్ట్మెంట్ చేసికొని ఉంటుందో ఊహించండి.
తల్లిదండ్రులు మరియు సంతానం మధ్య అడుగడుగునా ఎడ్జస్ట్మెంట్స్ తప్పవు. అవగాహన పూర్వకంగా మనం ఎడ్జస్ట్ కావటం వల్ల శాంతి లభిస్తుంది, మనకి కర్మబంధాలు ఏర్పడవు. మన చుట్టుప్రక్కల వారితో మనం ఎడ్జస్ట్ కాకపోతే సమస్యలను ఆహ్వానించినట్లు లేదా సృష్టించుకొన్నట్లవుతుంది. “సర్వత్ర సర్దుకొని పొండి” (Adjust every where) అనే తాళంచెవి జీవితంలో అన్ని ద్వారాలను తెరుస్తుంది. జ్ఞానిపురుషుడు దాదాశ్రీ యొక్క "ఎడ్జస్ట్ ఎవ్విరివేర్” అనే స్వర్ణమయసూత్రాన్ని మన జీవితంలో అన్వయించుకొన్నచో జీవితం సుఖమయం అవుతుంది, సుందరంగా వుంటుంది.
డా. నీరుబెన్ అమీన్