________________
సర్వత్ర సర్దుకొనిపొండి
పాపకర్మను చేస్తున్నాడు. మీరీ విషయాలను అతనికి తెలియచెప్పి, మరల అతడు ఆతప్పు చేయకుండా అతనిని ఒప్పించగలరు. లేనిచో అజ్ఞానం ఇలాగే వృద్ధిపొందుతుంది. మూఢ జ్ఞానం వల్లనే ప్రజలు ఎడ్జస్ట్ కాలేకపోతున్నారు.
యదార్ధ జ్ఞానం గలవారే ఎడ్జస్ట్ అవుతారు.
25
యదార్ధ జ్ఞానం యొక్క చిహ్నం ఏమిటి? యింట్లో మిగిలిన వారంతా మిస్ ఎడ్జస్ట్ అయినప్పటికీ, యదార్ధ జ్ఞానం కలవారొక్కరూ ఎడ్జస్ట్ అవుతారు. అన్ని పరిస్థితుల్లోను ఎడ్జస్ట్ అవ్వటం యదార్ధ జ్ఞానం యొక్క ఒక చిహ్నం. ప్రాపంచిక వ్యవహారాలను గురించి కడపటి మరియు సూక్ష్మ అన్వేషణ గావించిన తర్వాతనే నేను మీకీ విషయాలన్నీ చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఎలా జీవించాలో, ఎలా ముక్తిని పొందాలో నేను మీకు చూపుతున్నాను. మీ సమస్యలను, ఆటంకాలను తగ్గించటమే నాధ్యేయం.
మీరు చెప్పింది ఏమైనప్పటికీ అది ఎదుటివారికి ఆమోదయోగ్యంగా ఉండాలి. మీరు చెప్పింది అతనికి సమ్మతం కానిచో అది మీ తప్పు. మీ తప్పుని మీరు సరిచేసుకొన్నప్పుడు మాత్రమే మీరు ఎడ్జస్ట్ కాగలరు. 'ప్రతి చోట సర్దుకొని పోవాలి' ఇది మహావీర్ భగవానుని సందేశం.
ప్రశ్నకర్త : దాదా! మీరిచ్చిన ఈ 'ఎడ్జస్ట్ ఎవ్విరీవేర్' సందేశం ప్రతి సమస్యనూ పరిష్కరిస్తుంది. సమస్య యొక్క తీవ్రతతోగాని, ఆవ్యక్తి యొక్క స్వభావంతోగాని సంబంధం లేకుండా ఈ సూత్రం అన్ని సమస్యలనూ పరిష్కరించగలదు.
దాదాశ్రీ : అన్ని సమస్యలూ పరిష్కరించబడతాయి. నా ప్రతిమాటా మీ సమస్యలను పరిష్కరించి, మిమ్ము ముక్తులను చేస్తుంది. ప్రతి చోట సర్దుకొని పొండి.
ప్రశ్నకర్త : ఇప్పటివరకు మేము మాకు యిష్టమైన పరిస్థితులలో, యిష్టమైన వ్యక్తులతో మాత్రమే ఎడ్జస్ట్ అయ్యాం. యిష్టంలేని పరిస్థితులలో, మాకు యిష్టం లేని వ్యక్తులతో కూడ మేము ఎడ్జస్ట్ కావాలని మీరు చెప్తున్నారు.
దాదా శ్రీ : మీ యిష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ప్రతి చోట ఎడ్జస్ట్ కావాలి.