________________
13
సర్వత్ర సర్దుకొనిపొండి
గ్రహించారు. సాధారణంగా ఈ పరిస్థితిలో మీరు ఎడ్జస్ట్ అవ్వరు. ఇకమీదట చేసిన తప్పుకు క్షమాపణ అడిగే విధంగా ఎడ్జస్ట్ అవ్వాలని మీరు దృఢంగా నిర్ణయించుకోండి. ఇలా చెప్పండి “డియర్ ఫ్రెండ్, నా తప్పుకి నన్ను క్షమించు. నా మాటలతో అపుడు నిన్ను గాయపరిచాను.” ఇది ఎడ్జస్ట్ మెంట్. ఈ విధంగా చేయటానికి నీకేమైనా అభ్యంతరమా? ప్రశ్నకర్త : ఏమాత్రం లేదు.
ప్రతిచోట ఎడ్జస్ట్ కావాలి ప్రశ్నకర్త : చాలా సార్లు, ఒకే సమయంలో ఒకే విషయానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులతో మనం ఎడ్జస్ట్ కావలసి వుంటుంది. ఒకేసారి ఇద్దర్ని ఎలా సమాధానపరచగలం?
దాదాశ్రీ : మీరు యిద్దరినీ సమాధానపరచగలరు. ఒక వేళ మీరు ఏడుగురితో ఎడ్జస్ట్ కావలసి వచ్చినప్పటికీ దానిని మీరు చేయగలరు. ఒకరు మిమ్మల్ని “నా కోసం నువ్వేమి చేసావు?” అని అడిగినచో మీ సమాధానం ఇలా వుండాలి: “అవును. నువ్వు నన్నేమి చేయమంటే అది చేస్తాను.” ఇంకొక వ్యక్తికి కూడ ఇదే విధంగా చెప్పు. వ్యవస్థ లో లేనిది ఏమీ జరగదు. సంఘర్షణలను సృష్టించవద్దు. సర్దుబాటే తాళం చెవి. “అవును” అనటం వల్ల ముక్తి లభిస్తుంది. మీరు 'అలాగే' అని ఏడుగురికి చెప్పటం వల్ల వ్యవస్థ లో లేనిది ఏమైనా జరగబోతుందా? మీరు ఏ ఒక్కరికైనా 'కాదు' అని చెప్తే సమస్యలొస్తాయి.
భార్యాభర్తలిరువురూ కలిసి సర్దుకొనిపోవాలని గట్టిగా నిర్ణయించుకొంటే వారికి పరిష్కారం లభిస్తుంది. ఒకరు మొండికేస్తే రెండవవారు దానిని మన్నించటం ద్వారా సర్దుకొని పోవాలి.
నీవు ఎడ్జస్ట్ కాకుంటే పిచ్చివాడివి కాగలవు. అదే పనిగా ఇతరులను బాధించటం ఈ పిచ్చికి హేతువవుతుంది. మీరు ఒక కుక్కని ఒకటి, రెండు లేక మూడు సార్లు ఈ ద్రేకపరిచినచో అప్పటికీ అది గమనించి ఊరుకొంటుంది.
కానీ అదే పనిగా మీరు దానిని పీడిస్తూ ఉంటే అది మిమ్మల్ని కరుస్తుంది. కుక్క కూడ మిమ్మల్ని చెడ్డ వ్యక్తిగా తలుస్తుంది. ఇది గ్రహించవలసిన విషయం . ఎవరినీ రెచ్చగొట్టవద్దు. ప్రతి చోట సర్దుకొనిపొండి.