________________
సర్వత్ర సర్దుకొనిపొండి
10
ప్రార్థన ద్వారా సర్దుబాటు ప్రశ్నకర్త : ఎదుటి వ్యక్తికి తెలియజెప్పటం కోసం నేనెంతగానో ప్రయత్నించాను. ఆ తర్వాత దానిని గ్రహించటం, గ్రహించకపోవటం అతనికే వదలి పెట్టాలా?
దాదా శ్రీ : అతనికి విషయాన్ని వివరించటం నీ బాధ్యత. అయినా అతను గ్రహించకుంటే దానికి పరిష్కారం లేదు. అపుడు మీరు ఇలా చెప్పాల్సి వుంటుంది: (ఆ వ్యక్తిలోని పరమాత్మనుద్దేశించి) “దాదా భగవాన్! అతనికి అర్ధం చేసుకోగల సద్బుద్ధిని ప్రసాదించు.” ఇంత మాత్రమైనా మీరు చేయాలి. మీరతనిని నిర్లక్ష్యంగా వదిలివేయలేరు. ఇది అపాయకరం. ఇది దాదాజీ యొక్క అమూల్యమైన ఎడ్జస్ట్ మెంట్ విజ్ఞానం . ఎడ్జస్ట్ కాలేని మీ అశక్తత వల్ల కలిగే ఫలితాలను మీరు తప్పక అనుభవిస్తూ ఉండి ఉంటారు. ప్రతికూలత (డిజడ్జస్ట్మెంట్) మూర్ఖత్వం . భర్తగా తన అధికారాన్ని వదులుకోలేనని, తనమాటే చెల్లుబాటు కావాలని ఒకడు తలచినచో అతడు తన గొయ్యి తానే తవ్వుకొన్నవాడవుతాడు. అతని జీవితం దుఃఖకరమౌతుంది. విషయాలను వాటి దారిలో వాటిని నడవనివ్వండి. నీ భార్య “నువ్వు మందమతివి” అన్నట్లయితే నీవు సమాధానం యిలా చెప్పాలి “నీవు నిజమే చెప్పావు.”
సంక్లిష్టమైన ప్రజలతో ఎడ్జస్ట్ కావాలి. ప్రశ్నకర్త : సర్దుబాట్లు ఏకపక్షంగా ఉంటే ఈ ప్రపంచంలో కుదరదు. నిజమేనా? దాదాశ్రీ : ఆదర్శప్రాయమైన ప్రాపంచిక జీవనానికి నిర్వచనం సర్దుబాటు. ఇరుగుపొరుగు వారు కూడ సర్దుబాటుగల కుటుంబాన్ని గుర్తించి “ఈ ఇల్లు తప్ప ప్రతి యింట్లోను ఘర్షణ వుంది” అని చెప్తారు. మీరు ఎవరితో కలిసిమెలిసి ఉండటం లేదో ప్రత్యేకంగా వారితో కలిసిపోయేలా మీశక్తులను పెంపొందించుకోవాలి. మీరు ఎవరితో కలవగల్గుతున్నారో వారి విషయంలో ఈ శక్తులు మీకిప్పటికే ఉన్నాయి. ఎడ్జస్ట్ కాలేక పోవటం బలహీనత. ప్రతి ఒక్కరితో అనుకూలంగా ఉండటం నాకెలా సాధ్యమైంది? ఎంత ఎక్కువగా ఎడ్జస్ట్ అయితే అంత ఎక్కువగా మీ శక్తులు వృద్ధి పొందుతాయి, బలహీనతలు తగ్గిపోతాయి. మిథ్యా జ్ఞానము నాశనము చేయబడితే యదార్ధజ్ఞానము వ్యాప్తిలో ఉంటుంది.