________________
59
నేను ఎవరిని ?
ఇది దృఢ నిశ్చయంతో చెప్పబడింది.
నేను నిన్ను “నువ్వు నిజంగా చందుభావ్వా లేక శుద్ధాత్మవా” అని అడిగితే “శు ద్ధాత్మ” అని నువ్వు సమాధానం చెప్తావు. మరుసటి రోజు మరల నేను అదే ప్రశ్నవేస్తే నీవు మరల “శుద్ధాత్మ” అని చెప్తావు. ఇదే విధంగా నేను నిన్ను ఐదురోజులు ప్రశ్నించినచో అదే సమాధానం లభించినచో నీవు ఆత్మను పొందినట్లుగా నాకు తెలుస్తుంది. మీ మోక్షానికి తాళం చెవి నావద్ద ఉంది. మీరు ఫిర్యాదు చేసినా, అసమ్మతి తెలిపినా నేను వినను. శాస్త్రజ్ఞానము - అనుభవ జ్ఞానము
మీరు పొందిన జ్ఞానంలో సమస్త శాస్త్రాలసారము యిమిడి వున్నది. వేదాలలో, శాస్త్రాలలో ఏమి చెప్పబడిందో అది సత్యమే. అక్రమ విజ్ఞానం అన్ని శాస్త్రాలకంటే ఉన్నతమైనది మరియు వాటికి అతీతమైనది. శాస్త్రాలు ఆత్మను వర్ణించాయి. కాని దాని గుణాలను, లక్షణాలను పేర్కొనలేదు. నేను ఆత్మయొక్క పూర్తి వివరణ యిచ్చినందువల్ల మీరు మాత్రమే ఆత్మను పొందగలిగారు. క్రమ మార్గంలో మీరు పొందే అనుకూల గుణాలు ఏమైనప్పటికీ ఆత్మ సంబంధమైన సహస్రాంశాన్ని మాత్రమే మీరు పొందితే పొందవచ్చు. మీరు పొందేది ఏదైనప్పటికీ అది తనంతతానుగా కలిగే ఆత్మయొక్క జాగృతి మాత్రం కాదు. క్రమమార్గంలో ఆ జాగృతిని తనకు తానుగా గుర్తుచేసుకోవాలి. కాని అక్రమమార్గంలో జాగృతి దానంతట అదే సహజంగా వుంటుంది. నీవు మధ్యరాత్రిలో నిద్రమేల్కాంచినపుడు కూడ ఈ జాగృతి వుంటుంది. అనాత్మ విభాగంలోకి వచ్చే వాటిని గుర్తుపెట్టుకొనే ప్రయత్నం మాత్రమే నీవు చేయాల్సి వుంటుంది. ఆత్మను గుర్తుపెట్టుకోవలసిన అవసరం లేదు. ఒకసారి నీ నిజ స్వరూపము ఆత్మగా గుర్తించబడిన తర్వాత దానిని గుర్తుపెట్టుకొనుటకు నీవు ఏ ప్రయత్నమూ చేయనవసరం లేదు.
తాత్కాలిక ప్రభుత్వ స్థాపన
జ్ఞానం తర్వాత, శుద్ధాత్మ స్థితి లభిస్తుంది. కానీ పరమాత్మస్థితి (పూర్ణానుభూత స్థితి) ఇంకా పొందబడలేదు. ఇపుడు సంపాదించినది తాత్కాలికస్థితి, పాక్షికమైన ఆత్మానుభూతి (అంతరాత్మ).