________________
నేను ఎవరిని ?
భగవంతుడెక్కడో పైన ఉన్నాడని నీవు కూడ నమ్ముతున్నావు. అవునా? పైన ఎవరూ లేరు. పైన ఎవరో ఉన్నారనేది నీ మూఢనమ్మకము. ఇవి అన్నీ రాంగ్ బిలీఫ్స్ అని తెలియజేయటం కోసమే నేను వచ్చాను; ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించకపోతే మీ తప్పుడు నమ్మకములు మరియు భ్రమ అలాగే వుండిపోతాయి. పారంపర్యంగా సంక్రమించిన నమ్మకాలు అంతంకావటం జరగదు.
ప్రపంచం దానికదే చిక్కు ప్రశ్న ప్రపంచం దానంతట అదే చిక్కు ప్రశ్నగా తయారైంది. భగవంతుడు దానిని సృష్టించలేదు. ఈ పజిల్ ను భగవంతుడు సృష్టించివుంటే ప్రపంచంలోని బాధలన్నింటికి భగవంతుడినే మనం బాధ్యునిగా చేయగలిగే వాళ్లం. ప్రజలందరికీ ఎందుకు బాధలు కల్గిస్తున్నావని అతడిని నిలదీ సేవాళ్లం. కానీ ఈ పజిల్ ను భగవంతుడు సృష్టించలేదు. భగవంతుడు కేవలం భగవంతుడే; భగవంతుడంటే శాశ్వత బ్రహ్మానందస్థితి. మన అజ్ఞానంవల్ల భగవంతునిపై నేరంమోపి చాలా పొరపాటు చేస్తున్నాము. దాని కారణంగానే ప్రపంచం దానికదే చిక్కుముడిగా తయారైంది. ఎవరుగానీ ఈ పజిల్ ను సృష్టించలేదు.
ఇప్పుడెవరైనా 'చందులాల్ కి బుద్ధి లేదు' అని అన్నట్లయితే అదినిన్ను కలవర పెడుతుందా లేదా?
ప్రశ్నకర్త : అవును. దాదా శ్రీ : ఎవరైనా నన్ను ఇప్పటికిప్పుడు అవమానపరచినా అదినన్ను కలవర పెట్టదు; కానీ అదే నీవిషయంలో అయితే నీకు కలతకల్గుతుంది. ఎందువల్లనంటే నీవు బందీవై వున్నావు. అజ్ఞానమనే త్రాళ్లు నిన్ను బంధించినాయి.
ప్రశ్నకర్త : మరి దీని గురించి మాకు పరిష్కారం ఎలా లభిస్తుంది?. దాదాశ్రీ : రెండు దృష్టికోణాలలో ఈ పజిల్ ని పరిష్కరించవచ్చు : ఒకటి లౌకిక దృష్టికోణం, మరిఒకటి అలౌకిక దృష్టికోణం. అలౌకికం శాశ్వతమైనది. లౌకికం తాత్కాలికమైనది. ఈ బంధువులంతా తాత్కాలికమైన సర్దుబాట్లు. కానీ నీవు శాశ్వతుడవు. శాశ్వతమైనది ఏదో, ఒకసారి నీవు కనుగొన్నట్లయితే ఈ చిక్కు ప్రశ్న పరిష్కారమవుతుంది. కలవరపాటు తొలగుతుంది. దైవాన్ని అన్వేషించే ఈ సాధువులు