________________
నేను ఎవరి ?
'నేను' మరియు 'నాది' వేరు చేయి
'నేను' మరియు 'నాది' వీటిని ఒక విభాగినిద్వారా విభజించమని నేను నీకు చెప్పినచో నీవు ఆపని చేయగలవా? వీటిని వేరుచేయటం ముఖ్యమని నీకు అన్పించటంలేదా? కొంచెం ముందో వెనుకో దీనిని నీవు తెలుసుకోవలసిందే. పెరుగు నుంచి వెన్నను వేరు చేయటానికి ఒక పద్ధతి ఉన్నట్లే 'నాది' మరియు 'నేను' ను వేరుచేయటానికి కూడ ఒక మార్గం వుంది.
ఈ క్షణంలో నీ వద్ద 'నాది' అని పేర్కొనబడేవి ఏవైనా ఉన్నాయా? 'నేను' మాత్రమే వున్నదా? లేక 'నేను' తో పాటు 'నాది' కూడ ఉన్నదా?
ప్రశ్నకర్త : 'నాది' అనేది అన్నివేళలా వుంది.
దాదాశ్రీ : ‘నాది' అనబడే వస్తువులు ఏమేమి వున్నాయి నీవద్ద ?
ప్రశ్నకర్త : 'నాయిల్లు' మరియు ఇంట్లోని అన్ని వస్తువులు.
దాదాశ్రీ : అవి అన్నీ నీవేనా? మరి భార్య ఎవరిది?
ప్రశ్నకర్త : ఆమె కూడ నాదే.
దాదాశ్రీ : మరి ఈ పిల్లలో ?
8
ప్రశ్నకర్త : వాళ్ళుకూడా నావారే.
దాదాశ్రీ : మరి ఈ వాచ్?
ప్రశ్నకర్త : అది కూడ నాదే.
దాదాశ్రీ : మరి ఈ చేతులు, ఇవిఎవరి చేతులు?
:
ప్రశ్నకర్త : అవి కూడా నావే.
దాదాశ్రీ : నాతల, నా శరీరం, నాపాదాలు, నా చెవులు, నాకళ్ళు అని చెప్తావు కదా! ఈ నీ శరీర భాగాలన్నీ 'నాది' అనే విభాగంలోకి వస్తాయి. 'నాది' అని చెప్పే ఆవ్యక్తి ఎవరు? 'నాపేరు చందూలాల్' అని చెప్పినపుడు 'నేను చందూలాల్' అని చెప్పినపుడు రెండూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని నీకు అన్పిస్తుందా?